Begin typing your search above and press return to search.

సంక్రాంతి సినిమాలు రొటీన్ విల‌న్లు ప‌ర‌మ రొటీన్!

By:  Tupaki Desk   |   15 Jan 2023 11:30 AM GMT
సంక్రాంతి సినిమాలు రొటీన్ విల‌న్లు ప‌ర‌మ రొటీన్!
X
సంక్రాంతి బ‌రిలో రెండు ఊర‌మాస్ యాక్ష‌న్ సినిమాలు విడుద‌ల‌య్యాయి. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య‌లో వింటేజ్ వీర‌య్య అంటూ చిరును ముఠామేస్త్రి- రౌడీ అల్లుడు త‌ర‌హా పాత్ర‌ల‌లో బాబి చూపించారు. అయితే ఇది ముందే ప్ర‌క‌టించి మ‌రీ చేశారు. అయితే ఈ సినిమాలో విల‌నీ కూడా ఏమంత కొత్త‌గా లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ప్ర‌కాష్ రాజ్ డ్యూయ‌ల్ షేడ్ విల‌నీ తెలుగు సినిమాకి కొత్తేమీ కాదు. అందువల్ల విల‌న్ పాత్ర‌పై స‌మీక్ష‌కులు ప‌ర‌మ రొటీన్ అని అన్నారు. వారిసు చిత్రంలోను వంశీ పైడిప‌ల్లి రొటీన్ విల‌న్ గా ప్ర‌కాష్ రాజ్ ని చూపించ‌డం కూడా కొంద‌రిని సంతృప్తి ప‌ర‌చ‌లేదు.

ఇక న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన వీర‌సింహారెడ్డి చిత్రంలో కూడా క‌న్న‌డ హీరో దునియా విజయ్ తో విల‌నీ పండించినా కానీ అత‌డి విల‌నీలో కొత్త‌ద‌నం ఏదీ లేద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ఓవ‌రాల్ గా ఇంత‌కుముందు చూసేసిన విల‌నీలు సంక్రాంతి ఆడియెన్ ని నిరుత్సాహప‌రిచాయి. వీర‌య్య విల‌నీ విష‌యంలో బాబీ.. వీర‌సింహం విల‌నీ విష‌యంలో గోపిచంద్ మ‌లినేని.. వారిసు విల‌నీ విష‌యంలో వంశీ పైడిపల్లి మ‌రింత జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉంటే బావుండేద‌ని సూచ‌న‌లు ఇప్పుడు తెలుగు మీడియాలో కనిపిస్తున్నాయి.

అయితే ఇక్క‌డ ప్ర‌తిదీ నిర్మాత హీరోతో కూడా కొన్ని ముడిప‌డి ఉంటాయి. ఒక‌వేళ ద‌ర్శ‌కులు తాము ఏదైనా ప్ర‌యోగం చేయాల‌నుకున్నా ఆ ఇద్ద‌రిని ముఖ్యంగా సంతృప్తి ప‌ర‌చాలి. ఒక‌వేళ సంతృప్తి ప‌ర‌చాలంటే బ‌డ్జెట్ లిమిటేష‌న్ కూడా ఒక అడ్డంకిగా నిలుస్తుంది. విల‌నీ స్పాన్ పెరిగేకొద్దీ బ‌డ్జెట్లు కూడా పెరిగేందుకు ఛాన్సుంది. నిజానికి రామ్ చ‌ర‌ణ్ `ఎవడు` సినిమాలో రొటీన్ యాక్ష‌న్ దృశ్యాల్ని ఎందుకు తెర‌కెక్కించార‌ని `తుపాకి` అప్ప‌ట్లోనే ఎక్స్ క్లూజివ్ గా వంశీ పైడిప‌ల్లిని ప్ర‌శ్నించింది. ఎవ‌డులో యాక్ష‌న్ దృశ్యాలు ప‌ర‌మ రొటీన్. ఇలాంటి క‌థాంశంలో యాక్ష‌న్ కింగ్ అర్జున్ న‌టించిన జెంటిల్ మేన్ ని మించి యాక్ష‌న్ ని డిజైన్ చేసేందుకు తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉన్నా అలా ఎందుకు చేయ‌లేదు? అని ప్ర‌శ్నించ‌గా.. ఇంత‌కీ మీరు ఏ మీడియా? అంటూ వంశీ పైడిప‌ల్లి కుతూహాలం ప్ర‌ద‌ర్శించారు. నిజానికి ఆ ఆలోచ‌న త‌న‌కు కూడా ఉండేద‌ని కూడా చెప్పారు. కానీ బ‌డ్జెట్ లిమిటేష‌న్స్ లో కొన్నిటి విష‌యంలో రాజీకి రావాల‌ని కూడా అత‌డు హింట్ ఇచ్చారు. ఇది ఒక కోణం..!! కానీ మ‌న ద‌ర్శ‌కులు బ‌డ్జెట్ లిమిటేష‌న్స్ లోనే కొత్త త‌ర‌హా విల‌నీ క్రియేట్ చేయ‌డ‌మెలానో ఆలోచించాలేమో!!