Begin typing your search above and press return to search.

సాదాసీదా ఆల్బమ్ తో చెర్రీకి టెస్ట్ పెట్టిన దేవీ!

By:  Tupaki Desk   |   28 Dec 2018 4:24 AM GMT
సాదాసీదా ఆల్బమ్ తో చెర్రీకి టెస్ట్ పెట్టిన దేవీ!
X
తెలుగులో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడిగితే దేవీ శ్రీ ప్రసాద్ అని చిన్నపిల్లాడైనా తడుముకోకుండా చెప్పేస్తాడు. కారణాలు అందరికీ తెలిసినవే. సంగీతజ్ఞులు.. సంగీత విమర్శకులను పక్కన బెట్టేస్తే సాధారణ ప్రేక్షకులకు ఏం కావాలో అవి సమపాళ్ళలో అందించడంలో దేవీ ఒక దిట్ట.. సరిగమల పుట్ట!

అసలే లాస్ట్ ఇయర్ 'భరత్ అనే నేను'.. 'రంగస్థలం' లాంటి చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చి ఉండడంతో చరణ్ - బోయపాటి సినిమా 'వినయ విధేయ రామ' కు మరో రాకింగ్ ఆల్బమ్ ఖచ్చితంగా ఇస్తాడని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు ఫుల్ ఆడియో బయటకు వచ్చేసింది. రెండు పాటలు తప్ప మిగతావన్నీ అంతంత మాత్రమే. ఓవరాల్ గా ఆల్బమ ను చూస్తే..సారీ 'వింటే'.. గతంలో విన్నట్టుగానే ఉన్నాయిగానీ కొత్తదనం మాత్రం శూన్యం. ఈ పాటలను 'రంగస్థలం' పాటలతో పోల్చడం సరికాదు కానీ ప్రేక్షకులు మాత్రం పోల్చి చూసి పెదవి విరుస్తున్నారు.

అసలే 'వినయ విధేయ రామ' ఊర మాస్ సినిమా. ట్రైలర్ ఆ విషయాన్ని డబల్ కన్ఫాం చేసింది. సో.. ఈ సినిమా విజయానికి మాస్ యాక్షన్ సీక్వెన్సులతో పాటుగా అదిరిపోయే పాటలు అవసరం. ఇప్పుడు రాకింగ్ పాటలు లేవు కాబట్టి అద్భుతమైన విజువల్స్ తో బోయపాటి.. కేక స్టెప్పులతో చెర్రీ ఈ మ్యూజిక్ ను కవర్ చేయాల్సి ఉంటుందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బోయపాటి సారూ కొ..ణి.. దె..ల.. వా..రు ఏం చేస్తారో వేచి చూడాలి.