Begin typing your search above and press return to search.

మరీ ఒక్క టికెట్ ఏంటి చెర్రీ

By:  Tupaki Desk   |   28 Jan 2019 5:36 AM GMT
మరీ ఒక్క టికెట్ ఏంటి చెర్రీ
X
రంగస్థలం లాంటి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ తర్వాత అభిమానులే కాదు సామాన్య ప్రేక్షుకులు సైతం రామ్ చరణ్ నుంచి మినిమం గ్యారెంటీ ప్రొడక్ట్ ఆశించడం తప్పేమీ కాదు. ఆ అంచనాలను నట్టేట ముంచేసి బయ్యర్ల నెత్తిన తడిగుడ్డ మిగిల్చిన వినయ విధేయ రామ ఎంత డిజాస్టరో చెప్పుకునే కొద్దీ ఫ్యాన్స్ పల్స్ రేట్ అంతకంతా తగ్గిపోతుంది. ఇక్కడే పరిస్థితి ఇలా ఉంటే ఇక ఓవర్సీస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ధృవ నుంచి రామ్ చరణ్ కు క్రియేట్ అయిన మంచి మార్కెట్ వివిఆర్ మళ్ళీ మొదటికే తెచ్చింది.

అమెరికాలో మొన్న ఒక్క రోజు వచ్చిన కలెక్షన్ అక్షరాల 13 డాలర్లట. మీరు చదివింది నిజమే. కేవలం ఒకే ఒక్క ప్రేక్షకుడి నుంచి వచ్చిన ఆ మొత్తంలో షేర్ ఎంతని అడగకండి. ఒక స్టార్ హీరో ఇంత పెద్ద ఫ్యాన్ బేస్ పెట్టుకుని పట్టుమని మూడు వారాలు పూర్తికాకముందే ఇంత దారుణమైన డిజాస్టర్ గా ఫైనల్ రన్ కు రావడమే షాక్ కలిగించే అంశం. ఎంత తేడాగా ఉన్నా కనీస వసూళ్లు వస్తాయన్న అంచనాకు భిన్నంగా వినయ విధేయ రామ కేవలం $253K మాత్రమే రాబట్టింది. ఇది ఎంత కాదనుకున్నా ఘోర పరాభవమే.

మెగా హీరోని ఎలా చూపించినా చెల్లుతుంది అనే బోయపాటి అంచనా నిలువునా ముంచేసింది. 1.8 మిలియన్ డాలర్లు వస్తేనే బ్రేక్ ఈవెన్ సాధ్యమైన పరిస్థితుల్లో ఇంత తీసికట్టు వసూళ్లను చూస్తే స్టార్ కంటే కంటెంట్ ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అయినా మరీ ఒక్క టికెట్ మాత్రమే తెగెంత దారుణంగా కలెక్షన్లు పడిపోతే ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారు అనే డౌట్ రావడం సహజమే. అయితే ఇది ముందస్తు ఒప్పందంలో ఫిక్స్ చేసుకున్న రన్ కాబట్టి వేసారు. అదే మన రాష్ట్రంలో ఏ సెంటర్ లో అయినా ఇలా ఒక్క టికెట్ తెగితే బాబ్బాబు అని బ్రతిమాలి అతని టికెట్ సొమ్ము ఇచ్చి మరీ పంపించేస్తారు. అవును మరి కనీసం ప్రొజెక్టర్ కు అయ్యే కరెంట్ బిల్ అంత సొమ్ము కూడా రాకపోతే సినిమాలెందుకు ఆడించడం