Begin typing your search above and press return to search.

వైజాగ్‌ లో కొణిదెల రాముడి వేడుక?

By:  Tupaki Desk   |   10 Nov 2018 6:50 AM GMT
వైజాగ్‌ లో కొణిదెల రాముడి వేడుక?
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ - బోయపాటి శ్రీనుల కాంబినేషన్‌ లో తెరకెక్కుతున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం టీజర్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఒక్క రోజులోనే టీజర్‌ ఏకంగా 10 మిలియన్‌ ల డిజిటిల్‌ వ్యూస్‌ ను దక్కించుకుంది. టీజర్‌ తో మాస్‌ ఆడియన్స్‌ ను విపరీతంగా ఆకట్టుకున్న చరణ్‌ తన మాస్‌ పవర్‌ ను చూపించబోతున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. బోయపాటి మూవీ అంటేనే మాస్‌ మసాలా ఎలిమెంట్స్‌ ఫుల్‌ గా ఉంటాయి. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఆడియో వేడుకను డిసెంబర్‌ లో విడుదల చేయబోతున్నారు.

షూటింగ్‌ ఇప్పటికే టాకీ పార్ట్‌ మినహా అంతా పూర్తి అయినట్లుగా ప్రకటన వచ్చింది. మిగిలి ఉన్న పాటల చిత్రీకరణ డిసెంబర్‌ రెండవ వారంకు పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాటల చిత్రీకరణ పూర్తి చేయగానే అంటే డిసెంబర్‌ నాల్గవ వారంలో ఆడియో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ చిత్రం ఆడియోను వైజాగ్‌ లో నిర్వహించాలని భావిస్తున్నారట. చరణ్‌ గత చిత్రం ‘రంగస్థలం’ చిత్రం ఆడియో వేడుకను వైజాగ్‌ లో నిర్వహించారు. ఆ చిత్రం భారీ బ్లాక్‌ బస్టర్‌ అయ్యింది. అందుకే సెంటిమెంట్‌ వర్కౌట్‌ అవుతుందనే ఉద్దేశ్యంతో వైజాగ్‌ లోనే వినయ విధేయ రామ చిత్రం ఆడియో వేడుకను ప్లాన్‌ చేస్తున్నారు.

టీజర్‌ లో చరణ్‌ చెప్పిన ‘రామ్‌.. రామ్‌ కొ ణి దె ల’ డైలాగ్‌ ప్రస్తుతం మెగా ఫ్యాన్స్‌ ను ఊపేస్తోంది. ఆ డైలాగ్‌ కు మంచి రెస్పాన్స్‌ రావడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొణిదెల రాముడి సత్తా ఈ చిత్రంతో మరోసారి చూపించడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.