Begin typing your search above and press return to search.

న‌ష్టాల్లో `అజ్ఞాత‌వాసి` ఫీట్ రిపీట్

By:  Tupaki Desk   |   21 Jan 2019 4:28 AM GMT
న‌ష్టాల్లో `అజ్ఞాత‌వాసి` ఫీట్ రిపీట్
X
గ‌త ఏడాది ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `అజ్ఞాత‌వాసి` భారీ అంచ‌నాల న‌డుమ రిలీజై డిజాస్ట‌ర్ అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో పంపిణీదారులు, బ‌య్య‌ర్లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అయితే `అజ్ఞాత‌వాసి` చిత్రాన్ని నిర్మించిన‌ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ ఆ న‌ష్టాల్లో కొంత భాగం షేర్ చేసుకుంది. బ‌య్య‌ర్ల‌కు తిరిగి కొంత మొత్తాల్ని వెన‌క్కి ఇచ్చేసింద‌న్న ప్ర‌చారం సాగింది. సేమ్ టు సేమ్ సీన్ ఇప్పుడు `విన‌య విధేయ రామ‌` విష‌యంలోనూ రిపీట‌వుతోంద‌ని తెలుస్తోంది.

ఈ సంక్రాంతి బ‌రిలో మ‌రో మూడు సినిమాల‌తో పోటీప‌డుతూ రిలీజైన `విన‌య విధేయ రామ‌` చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఫెయిలైన సంగ‌తి తెలిసిందే. `రంగ‌స్థ‌లం` త‌ర‌హాలో పెద్ద హిట్ట‌య్యి బాక్సాఫీస్ వ‌ద్ద 100కోట్లు వ‌సూలు చేస్తుంద‌ని అంచ‌నా వేసారు. అందుకు త‌గ్గ‌ట్టే 90కోట్లు పైగానే ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేశారు. కేవ‌లం తెలుగు రాష్ట్రాల రిలీజ్‌ హ‌క్కుల కోసం యు.వి.క్రియేష‌న్స్ సంస్థ ఏకంగా 72 కోట్లు నిర్మాత‌ల‌కు చెల్లించిందిట‌. అయితే ఈ సినిమా ఏపీ, తెలంగాణ నుంచి 55కోట్ల మేర షేర్ రాబ‌ట్టింది. అంటే దాదాపు 15 కోట్లు పైగా న‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌న్న మాటా వినిపిస్తోంది.

ఓవ‌ర్సీస్‌లో అయితే విధేయ రామ‌ మ‌రీ నిరాశ‌ను మిగిల్చాడ‌న్న మాట వినిపిస్తోంది. దీంతో ఇటు తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు, అలాగే ఓవ‌ర్సీస్ డిస్ట్రిబ్యూట‌ర్ కు న‌ష్టాల నుంచి కాపాడేందుకు.. కొంత మొత్తాన్ని తిరిగి వెన‌క్కి ఇచ్చేందుకు వీవీఆర్‌ నిర్మాత‌ డివివి దాన‌య్య సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. ఇప్ప‌టికే యువి క్రియేష‌న్స్ కు రూ.5కోట్లు వెన‌క్కి ఇచ్చార‌ట‌. ఓవ‌ర్సీస్ పంపిణీదారుకు రూ.50లక్ష‌లు వెన‌క్కి ఇచ్చారు. వీళ్ల‌కు మ‌రో రూ.50 ల‌క్ష‌లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నార‌ట‌. డివివి ఎంట‌ర్‌టైన్ మెంట్స్ విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి సాయానికి ముందుకు రావ‌డం ఫిలింన‌గ‌ర్ లో చ‌ర్చ‌కొచ్చింది. రామ్ చ‌ర‌ణ్ - ఎన్టీఆర్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ లో ఇప్ప‌టికే డివివి సంస్థ ఆర్.ఆర్.ఆర్ వంటి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. న‌ష్ట‌పోయిన వారికి ఆ సినిమా పంపిణీ రూపంలోనూ సాయం అందుతుంద‌నే అంచనా వేస్తున్నారు.