Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: రామ్ కొణిదెల మాస్ విశ్వరూపం
By: Tupaki Desk | 9 Nov 2018 5:52 AM GMTమెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీజర్ రానే వచ్చింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘వినయ విధేయ రామ’ టీజర్ ఈ రోజే లాంచ్ అయింది. ఈ కాంబినేషన్ కు తగ్గట్లే ఇది ఊర మాస్ సినిమా అని టీజర్ చూస్తే అర్థమైంది. 49 సెకన్ల టీజర్లో పూర్తిగా హీరో ఎలివేషన్ మీదే దృష్టిపెట్టాడు బోయపాటి. ప్రతి షాట్లోనూ మాస్ హీరోయిజమే కనిపించింది. టీజర్లో స్టోరీ లైన్ ఏంటన్నది రివీల్ చేయలేదు.
ఐతే అరాచకాలు చేసే ఒక బలవంతుడైన విలన్ని హీరో ఢీకొట్టడం అనే బోయపాటి లైన్లోనే సినిమా సాగేట్లు కనిపిస్తోంది. ‘‘అన్నాయ్ వీణ్ని చంపేయాలా భయపెట్టాలా.. భయపెట్టడానికైతే పది నిమిషాలు.. చంపేయాలంటే పావు గంట. ఏదైనా ఓకే.. సెలక్ట్ చేసుకో’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. మొదలు మొదలే బోయపాటి స్టయిల్లో ఒక ఆయుధం పట్టి రంగంలోకి దిగిపోయాడు రామ్ చరణ్. తర్వాత ఇంకొన్ని రకాల ఆయుధాలతో విలన్ల మీదికి దూసుకెళ్లాడు. టీజర్లో హీరో చరణ్.. విలన్ వివేక్ ఒబెరాయ్ తప్ప ఇంకే నోటెడ్ క్యారెక్టర్లు కనిపించలేదు.
టీజర్లో ఫినిషింగ్ టచ్ ఆశ్చర్యపరిచేదే. ‘‘రేయ్ నువ్వు పందెం పరశురామ్ అయితే ఏంట్రా.. ఇక్కడ రామ్ కొణిదెల’’ అంటూ చరణ్ తన సొంత పేరు.. ఇంటి పేరును మాస్ స్టయిల్లో చెప్పడం విశేషం. మెగా ఫ్యామిలీలో ఇప్పటిదాకా ఎవ్వరూ నేరుగా ఇంటి పేరును సినిమాలో పెట్టుకున్నది లేదు. మెగా ఫ్యాన్స్ సంగతేమో కానీ.. మామూలు జనాలకు మాత్రం ఇది అతిగానే అనిపిస్తోంది. మాస్ ఎలివేషన్లతో అభిమానులకు కిక్కివ్వడం సంగతేమో కానీ.. టీజర్లో కొత్తదనం మాత్రం రవ్వంతైనా కనిపించలేదు. బోయపాటి ఎప్పట్లాగే ఒక ఫార్మాట్లో సినిమాను నడిపించేసినట్లున్నాడు.