Begin typing your search above and press return to search.
మరి `బద్రినాథ్`లా మాత్రం కాకూడదు.. వినాయక్!
By: Tupaki Desk | 19 July 2015 5:57 AM GMTరాజమౌళి రూ 45కోట్లతో `మగధీర` చేశాడు. అప్పటికి అదే పెద్ద బడ్జెట్టు. వామ్మో... చరణ్ రెండో సినిమాకే అంత బడ్జెట్టా అని మాట్లాడుకొన్నారంతా. కానీ రాజమౌళి వంద కోట్ల బడ్జెట్టయ్యిందేమో అనిపించేంత గ్రాండ్ గా ఆ సినిమా తీశాడు. అందుకే ఘన విజయం సాధించింది. ఆ సినిమాని చూశాక ఇతరత్రా అగ్ర దర్శకులు `తామూ అలాంటి భారీ సినిమా తీస్తే ఎలా ఉంటుందా` అని ఆలోచించుకొన్నారు. ముఖ్యంగా వి.వి.వినాయక్ `బద్రినాథ్` కథని అలా తీయాలని ప్లాన్ చేశాడు. `మగధీర`ని నిర్మించిన అల్లు అరవింద్ తోనే రూ 50కోట్లు పెట్టుబడి పెట్టించి `బద్రినాథ్` తీశాడు. కానీ ఆ సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రేక్షకులకు చేరువకాలేకపోయింది. ఇప్పుడు మళ్లీ అదే వినాయక్ వంద కోట్లతో సినిమా తీస్తా అంటున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` తప్ప వందకోట్ల పెట్టుబడితో తెలుగులో మరే సినిమా రాలేదు. దీన్నిబట్టి `బాహుబలి`ని చూశాకే వినాయక్ కి వందకోట్ల సినిమా ఆలోచన వచ్చుండొచ్చు.
వినాయక్ అంటే ఓ గొప్ప మాస్ డైరెక్టర్. తొలి నుంచీ భారీ సినిమాల్నే తీస్తున్నాడు. పరిశ్రమ చెప్పుకోదగ్గ ఎన్నో విజయాల్ని అందించాడు. ఆయన వందకోట్లతో సినిమా తీస్తానంటే తప్పకుండా నిర్మాతలు ముందుకొస్తారు. అయితే ఆ సినిమా `బద్రినాథ్`లా మాత్రం కాకూడదనేది పరిశ్రమ వర్గాలు చెప్పే మాట. భారీస్థాయి కథ ఉందనుకొన్నప్పుడే చేయాలి కానీ... ఎన్నికోట్లతో సినిమా తీస్తున్నామన్నది ముఖ్యం కాదనేది సినీ పెద్దల అభిప్రాయం. అయినా వినాయక్ లాంటి సీనియర్లకు ఆ విషయం ఇప్పటికే అనుభవంలోకి వచ్చుంటుంది. అందుకే... వందకోట్లతో మహేష్ తో తీయాలనుకొన్న సినిమా కోసం గట్టి కథనే తయారు చేయిస్తున్నా అని చెప్పుకొచ్చాడు వినయ్.