Begin typing your search above and press return to search.

వినాయక్ లేకుండానే 150 షూటింగ్..

By:  Tupaki Desk   |   7 Dec 2016 7:45 AM GMT
వినాయక్ లేకుండానే 150 షూటింగ్..
X
అవును.. నిజంగానే దర్శకుడు వి.వి.వినాయక్ లేకుండానే ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ జరిగిందట. అలాగని వినాయక్ ఏమీ సైడైపోలేదు. ఆయనే ఈ చిత్రానికి దర్శకుడు. ఆయనకు చిరుతో అభిప్రాయ భేదాలు కూడా ఏమీ రాలేదు. కాకపోతే సినిమాను అనుకున్న ప్రకారం సంక్రాంతికి రిలీజ్ చేసి తీరాలన్న పట్టుదలతో వినాయక్ లేకుండానే కొన్ని సన్నివేశాలు తీయాల్సి వచ్చిందట. చివరి దశలో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఒకేసారి వేర్వేరు చోట్ల రెండు యూనిట్లు పని చేశాయట. ఒక యూనిట్ రామోజీ ఫిలిం సిటీలో సన్నివేశాలు తీస్తుంటే.. మరో యూనిట్ నాగార్జున సాగర్ సమీపంలో కొన్ని సీన్లు తీసింది. ఈ సందర్భంలో వినాయక్ ఒక్క చోటే ఉండగలిగాడు. మరోచోట మెగా ఫ్యామిలీతో బాగా అసోసియేట్ అయిన అసిస్టెంట్ డైరెక్టర్లు సన్నివేశాల్ని పర్యవేక్షించారు. ఎలాగూ ‘ఖైదీ నెంబర్ 150’ రీమేక్ మూవీనే కాబట్టి.. స్క్రిప్టు కూడా పక్కాగా ఉంది కాబట్టి.. ఇలా వేర్వేరు యూనిట్లతో షూట్ చేసినా ఇబ్బంది లేకపోయింది.

ఈ ఏడాది ఆరంభంలో పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఒకేసారి రెండు మూడు యూనిట్లతో షూటింగ్ చేశారు. చివరి రెండు నెలలు రేయింబవళ్లు కష్టపడి సినిమాను సిద్ధం చేశారు. ఐతే ‘ఖైదీ నెంబర్ 150’లో అంత హడావుడేమీ లేదు. ఇలా రెండు యూనిట్లు పని చేసింది కొన్ని రోజులు మాత్రమే. ఇప్పటికే సినిమా దాదాపుగా పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ మొదలవుతుంది. ‘ఖైదీ నెంబర్ 150’ టీజర్ ‘ధృవ’ థియేటర్లలో ప్రదర్శితం కాబోతున్న సంగతి తెలిసిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/