Begin typing your search above and press return to search.
అప్పుడు పూరి.. ఇప్పుడు వినాయక్
By: Tupaki Desk | 14 Nov 2015 5:30 PM GMTఒకప్పుడు చిరంజీవి సినిమాలకు బేనర్లు కట్టినోడు ఇప్పుడు ఆయన సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు... అంటూ సంబరాలు చేసుకున్నాడు పూరి జగన్నాథ్ కొన్ని నెలల కిందట. కానీ చివరికి ఏమైంది..? చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోల్పోయాడు పూరి. ‘టెంపర్’ సినిమాతో చిరుకు ఉత్సాహం తెప్పించినా.. ‘జ్యోతిలక్ష్మి’ సినిమాతో తన మీద ఉన్న ఇంప్రెషనంతా పోగొట్టేశాడు పూరి. ‘ఆటోజానీ’ సెకండాఫ్ నచ్చలేదన్నది సాకే తప్ప.. నిజమైన కారణం ‘జ్యోతిలక్ష్మి’ ఫలితమే. ఇప్పుడు ఇలాంటి అనుభవమే వి.వి.వినాయక్ కు కూడా ఎదురైందంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మొన్నటిదాకా వినాయక్ దర్శకత్వంలో చిరు ‘కత్తి’ రీమేక్ లో నటించడం పక్కా అనుకున్నారు. ‘బ్రూస్ లీ’ ఆడియో ఫంక్షన్ లో చిరును ఉద్దేశించి వినాయక్ ‘కత్తిలా ఉన్నారు’ అనడంతో ఆ ప్రాజెక్టుపై ఇక అధికార ప్రకటన రావడమే తరువాయి అనుకున్నారు. కానీ ఇంతలోనే ‘కత్తి’ పక్కకెళ్లిపోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఆ కథ పక్కనబెట్టేసినా వినాయక్‌తో మరో సినిమా అయినా చేస్తాడేమో అనుకుంటే.. ‘అఖిల్’ సినిమా ఆ అవకాశాలకు తెరదించేసినట్లే కనిపిస్తోంది. ‘అఖిల్’ సినిమా రిజల్ట్.. అందులో వినాయక్ పనితనం చూశాక చిరుకు మళ్లీ సందేహాలు పట్టుకున్నాయి. కథ విషయంలో మెలిక పెట్టి వినాయక్ ను సైతం చిరు ఎలిమినేట్ చేసేయడం ఖాయమంటున్నారు. మరి ‘చిరు 150’ రేసులోకి వచ్చే కొత్త దర్శకుడెవరో?