Begin typing your search above and press return to search.
మహేష్ కోసం కథ వండిస్తున్నాడు
By: Tupaki Desk | 30 Sep 2015 7:30 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబుతో భారీ సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు వివి వినాయక్. ఏకంగా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి... భారీ చిత్రాన్ని తీస్తానన్నాడు ఈ మాస్ డైరెక్టర్. ఇప్పుడా పిక్చర్ కి సంబంధించిన స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ రైటర్ తో కథ వండిస్తున్నాడట. ఇప్పటికే అఖిల్ ని దాదాపు పూర్తి చేసిన వినాయక్.. ఇప్పుడు నెక్ట్స్ వెంచర్ పై దృష్టి పెట్టేశాడు. ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ తో స్టోరీ డిస్కషన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాగైనా మహేష్ తో వంద కోట్ల సినిమా చేసి.. సూపర్ సక్సెస్ సాధించాలన్నది వినాయక్ టార్గెట్. అయితే.. ప్రస్తతుతం బ్రహ్మోత్సవం చేస్తున్నాడు మహేష్ బాబు. దీన్ని శరవేగంగా పూర్తి చేసి సంక్రాంతికి స్క్రీన్స్ పైకి తేవాలన్నది టార్గెట్. ఇందుకోసం శ్రీకాంత్ అడ్డాలకు స్ట్రిక్ట్ గా ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు. హీరోలను మాస్ చిత్రాలతో ఎలివేట్ చేయడంలో వినాయక్ టేకింగ్ సూపర్ గా ఉంటుంది. అందుకే ఈయన డైరెక్షన్ చేసేందుకు ప్రిన్స్ రెడీగా ఉన్నా.. .అధికారిక ప్రకటన మాత్రం బ్రహ్మోత్సవం తర్వాతే వచ్చే అవకాశముంది.
ఒక మూవీ జరుగుతున్నపుడు నెక్ట్స్ వెంచర్ గురించి చెప్పే అలవాటు మహేష్ కు లేదు. అందుకే బ్రహ్మోత్సవం షూటింగ్ తర్వాత... వినాయక్ సినిమా సంగతులు ప్రకటించాలని భావిస్తున్నాడు. ఒక వేళ అన్నీ ఓకే అయి.. ప్రాజెక్ట్ పట్టాలెక్కితే మాత్రం.. మహేష్ మంచి మసాలా నుంచి వచ్చేస్తున్నట్లే.