Begin typing your search above and press return to search.
పొగరు ఒంట్లో.. హీరోయిజం ఇంట్లో..
By: Tupaki Desk | 22 Aug 2016 4:26 PM GMTచిరంజీవి 61వ బర్తడే వేడుకల్లో.. మెగా డైరక్టర్ వివి వినాయక్ చాలా ఎక్సయిటింగ్ గా మాట్లాడారు. గతంలో మెగాస్టార్ ను ''ఠాగూర్'' సినిమాలో డైరక్టు చేసిన వినాయక్ ఇప్పుడు తమిళ 'కత్తి' సినిమా రీమేక్ అయిన ''ఖైదీ నెం 150'' సినిమాలో డైరక్టు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏమన్నారంటే..
''ఇది ఆయనకు 61వ జన్మదినం కాదు.. సినిమా చూశాక మీరే అంటారు.. ఆయన 21వ జన్మదినం అని. ఎందుకంటే ఆయనే ఆ రేంజులో చేస్తున్నారు. ఫైట్లు కాని - డ్యాన్సులు కాని.. ఇరగదీశారు. చిరంజీవి గారికి ఒక అభిమానిగా.. మనందరం ఏమైతే ఆయన దగ్గర నుండి కోరుకుంటామా అవన్నీ అందులో ఉంటాయి. సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్టవుతుంది'' అంటూ చెప్పుకొచ్చారు వినాయక్. అంతేకాదు.. ఆయన ఈ సినిమాలోని ఒక డైలాగ్ కూడా చెప్పారు.
విలన్ కు ఇచ్చే ఓ కౌంటర్ గా చిరంజీవి చెప్పే డైలాగ్ ఏంటంటే.. ''అరేయ్ పొగరు నా ఒంట్లో ఉంటది.. హీరోయిజమ్ నా ఇంట్లో ఉంటది..'' అని మెగాస్టార్ అంటారట. ఈ డైలాగ్ చెప్పగానే ఒక్కసారిగా ఆడిటోరియం అంతా అదిరిపోయింది.