Begin typing your search above and press return to search.
ఫిబ్రవరి వరకూ ఏమీ మాట్లాడలేను
By: Tupaki Desk | 15 Nov 2015 7:30 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించే 150వ సినిమాకి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారా? లేదా? మెగాభిమానుల్లో 1000 వోల్టుల విద్యుత్ ని ప్రవహింపజేసే ప్రశ్న ఇది. ఠాగూర్ లాంటి సినిమా ఇచ్చిన వినాయక్ అయితేనే బావుండేది అన్న భావన మొన్నటివరకూ కనిపించేది. అయితే ఇటీవలే అఖిల్ ఫలితం చూశాక .. జనాలంతా పెదవి విరిచేశారు. వినాయక్ పూర్ డైరెక్షన్ స్టయిల్ - స్ర్కీన్ ప్లే స్కిల్స్ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయ్యాయన్న బ్యాడ్ టాక్ వచ్చింది. కారణం ఏదైనా వినయ్ ఇప్పటికి ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి.
అఖిల్ సినిమా కోసం వినాయక్ ఎంతో శ్రమించారన్నది నిజం. ఆ సినిమా కోసం దేశ విదేశాలు తిరిగి షూటింగులు చేశారు. రిలీజ్ కి ముందు అతడిపై తీవ్రమైన ఒత్తిడి పడిందన్నది వాస్తవం. ఏడాది పైగానే శ్రమించి అఖిల్ ని స్టార్ హీరోగా ఆవిష్కరించాలని ఎంతో తపించాడు. అయినా తానొకటి తలిస్తే అన్న చందంగా రిజల్ట్ వచ్చింది. ఇందుకు పూర్తి బాధ్యత వినాయక్ దే అని విమర్శలొచ్చాయి. ఏదేమైనా ఈ కన్ఫ్యూజన్ నుంచి బైటపడేందుకు రెండు నెలల పాటు సుదీర్ఘ విరామం తీసుకుంటున్నానని వినాయక్ ప్రకటించాడు. 150వ సినిమా గురించి మాట్లాడాల్సి వచ్చినా ఫిబ్రవరి వరకూ ఏదీ మాట్లాడలేని పరిస్థితి అని కన్ఫమ్ చేశాడు. అప్పట్లో చిరుతో భేటీ కేవలం పర్సనల్ మీట్ మాత్రమేనని ఇటీవలి కాలంలో చెప్పిన సంగతి తెలిసిందే.