Begin typing your search above and press return to search.
వినాయక్ కొత్త అవతారమెత్తుతున్నాడా?
By: Tupaki Desk | 2 March 2016 11:30 AM GMTదర్శకులు నిర్మాతలుగా మారడం తెలుగులో కొత్తేమీ కాదు. ఐతే తమ సినిమా కోసం నిర్మాత అవతారం ఎత్తకుండా.. కొత్త వాళ్లను ప్రోత్సహించడానికి స్టార్ డైరెక్టర్లు ప్రొడక్షన్ హౌజ్ లు మొదలుపెట్టే సంస్కృతి ఈ మధ్య ఊపందుకుంటోంది. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ కొత్త వాళ్లకు అవకాశం కల్పించడంతో పాటు.. సినిమా హిట్టయితే మంచి లాభాలు కూడా అందుకోవచ్చని చూస్తున్నారు కొందరు దర్శకులు. మారుతి మొదట్నుంచి ఈ రూట్లోనే వెళ్తుండగా.. తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ‘కుమారి 21ఎఫ్’తో నిర్మాతగా మారాడు. ఆ సినిమాకు రచన కూడా సుకుమారే చేశాడు.
ఐతే సుక్కులాగా రైటింగ్ ఆలోచనలేమీ లేవు కానీ.. ఆయనలా యంగ్ టాలెంట్ కు అవకాశాలిద్దామనే ఉద్దేశంతో మరో స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ కూడా నిర్మాత అవతారం ఎత్తబోతున్నట్లు సమాచారం. వినాయక్‌కు ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగంలో మంచి పరిచయాలున్నాయి. వినాయక్ అడగాలే కానీ.. పెట్టుబడి పెట్టడానికి చాలామంది ముందుకొస్తారు. వినాయక్ బ్రాండ్ వాల్యూ చాలు.. సినిమాకు హైప్ రావడానికి. కాబట్టి వినాయక్ నిర్మాతగా మారడానికి ఏ ఇబ్బందులూ లేవు. అందుకే త్వరలోనే ప్రొడక్షన్ హౌజ్ మొదలుపెట్టి.. తన అసిస్టెంట్లతో పాటు తనను మెప్పించే యంగ్ టాలెంట్ కు అవకాశాలివ్వాలని ఫిక్సయ్యాడట వినాయక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.