Begin typing your search above and press return to search.
స్టార్ నటుడి రేప్ కేసు కీలక టర్న్
By: Tupaki Desk | 9 Jan 2019 1:19 PM GMTబాలీవుడ్ లో మీటూ రేపిన ప్రకంపనలు మెల్ల మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే మీటూ ఉద్యమం తాలూకు వేడి తగ్గుతోంది. మీటూ భయం సినీ వర్గాలను వెంటాడుతూనే ఉంది. అయితే మీటూ అంటూ గతంలో కొందరు చేసిన విమర్శలు నిజం కాదని వెళ్లడవుతున్నాయి. బాలీవుడ్ లో తండ్రి పాత్రల్లో ఎక్కువగా నటించి సంస్కారీ ఫాదర్ గా ఫేమస్ అయిన అలోక్ నాథ్ పై వింటా నంద తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. మీటూ అంటూ వింటా నంద కొన్ని నెలల క్రితం అలోక్ నాథ్ పై సంచలన ఆరోపణలు చేసింది.
19 సంవత్సరాల క్రితం అలోక్ నాథ్ తనను రేప్ చేశారంటూ వింటా నంద ఏకంగా పోలీస్ కేసు పెట్టింది. ఈవయస్సులో రేపు కేసు ఎదురవ్వడంతో అలోక్ నాథ్ తీవ్రమైన మనోవేదనకు గురైనట్లుగా ఆయన సన్నిహితులు చెప్పుకొచ్చారు. అయితే అలోక్ నాథ్ పై వింటా నంద చేసిన ఆరోపణలపై విచారణ జరిపిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టులో అలోక్ నాథ్ కు ఊరట లభించింది.
వింటా నంద తన ఇంట్లో రేప్ జరిగిందని చెబుతున్నారు. కాని అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలు మాత్రం ఆమె చూపించలేక పోయారు. ఇక రేప్ జరిగిన సరైన తేదీని కూడా ఆమె చెప్పలేదని, ఆమె రేప్ జరిగినట్లుగా కనీసం ఒక్క ఆధారాన్ని అయినా కూడా చూపించక పోవడంతో పాటు, ఆమె వాదనలు నమ్మశక్యంగా లేవంటూ అలోక్ నాథ్ తరపు లాయర్లు వాదించారు. కోర్టు అలోక్ నాథ్ తరపు లాయర్ల వాదనతో ఏకీభవించి వింటానంద చేసిన ఆరోపణలు అసత్యమని, అలోక్ నాథ్ పరువు ప్రతిష్టలను దెబ్బ తీసేందుకు ఇలాంటి విమర్శలు చేశారంటూ ఆయన తరపు లాయర్లు వాదించిన నేపథ్యంలో ఈ కేసులో దాదాపుగా అలోక్ నాథ్ కు క్లీన్ చీట్ దక్కినట్లేనంటూ బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.