Begin typing your search above and press return to search.

'లైగర్' థియేటర్లలో 'ది ఘోస్ట్' హంగామా.. వింటేజ్ నాగ్ ఈజ్ బ్యాక్..!

By:  Tupaki Desk   |   25 Aug 2022 7:30 AM GMT
లైగర్ థియేటర్లలో ది ఘోస్ట్ హంగామా.. వింటేజ్ నాగ్ ఈజ్ బ్యాక్..!
X
'LBW-లైఫ్ బిఫోర్ వెడ్డింగ్' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు.. 'చందమామ కథలు' చిత్రంతో జాతీయ అవార్డ్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ క్రమంలో 'గుంటూరు టాకీస్' 'PSV గరుడవేగ' వంటి బ్యాక్ టూ బ్యాక్ విజయాలు అందుకొని కింగ్ అక్కినేని నాగార్జున తో వర్క్ చేసే అవకాశం అందుకున్నారు ప్రవీణ్.

నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ "ది ఘోస్ట్". ఈ హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ లో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో నాగ్ కనిపించనున్నారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించగా.. గుల్ పనాగ్ - అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే 'ది ఘోస్ట్' నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే ఈ వీడియో వీక్షించే అవకాశం ప్రేక్షకులకు దక్కింది.

ఈరోజు 'లైగర్' సినిమా విడుదలైన థియేటర్లలో "ది ఘోస్ట్" ట్రైలర్ జోడించబడింది. 1:55 నిమిషాల నిడివితో కట్ చేయబడిన ఈ వీడియో.. ఇంటర్వెల్ స్లైడ్ తర్వాత ప్లే అవుతుంది. దీనికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ మూవీ హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ లో ఉంది.

నాగార్జున ను ప్రవీణ్ సత్తారు స్టైలిష్ గా పవర్ ఫుల్ పాత్రలో పరిచయం చేసినట్లు 'ది ఘోస్ట్' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు అర్థమవుతుంది.

చాలా గ్యాప్ తర్వాత నాగ్ ఇంటెన్స్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారు. 'చావును చాలాసార్లు చాలా దగ్గరగా చూశాను' 'ఒక్కడిని కూడా వదలను' అంటూ భయంకరమైన గ్యాంగ్ స్టర్స్ - కిడ్నాపర్స్ - మర్డరర్స్.. ఇలా మొత్తం అండర్ వరల్డ్ తో ఫైట్ చేసే పాత్రలో నాగార్జున కనిపించారు.

తుపాకీలతో రౌడీలను వేటాడటం.. కత్తులతో శత్రు మూకను ఊచకోత కోయడం వంటి సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ చివర్లో నాగ్ చేతిలో ఒక చైర్ లో ఠీవిగా కూర్చొని ఉండటం.. పెద్ద కత్తి పట్టుకొని విలన్ మీదకు దూకడం వంటి షాట్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి.

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ సత్తారు మరోసారి తమ వర్క్ తో అందరినీ మెస్మరైజ్ చేయబోతున్నాడని 'ది ఘోస్ట్' ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. ప్రతీ ఫ్రేమ్ చాలా ఫ్రెష్ గా కనిపిస్తోంది. దుబాయ్ - ఊటీ వంటి అందమైన ప్రదేశాల్లో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ బాగున్నాయి.

నాగార్జున వంటి సీనియర్ హీరోని హ్యాండిల్ చేసిన విధానం.. అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే అన్ని కమర్షియల్ హంగులు ఉండేలా ఈ పవర్ ప్యాక్డ్ చిత్రాన్ని రెడీ చేసినట్లు తెలుస్తుంది. థియేటర్ లో 'ది ఘోస్ట్' ట్రైలర్ చూసిన తర్వాత అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. వింటేజ్ నాగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. దర్శకుడి పనితనం మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.

కమల్ హాసన్ కు 'విక్రమ్' ఎలాంటి విజయాన్ని అందించిందో.. నాగ్ కు ఈ సినిమా అలాంటి సక్సెస్ ఇస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. 'ది ఘోస్ట్' మూవీ తర్వాత ప్రవీణ్ సత్తారు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ లిస్టులో చేరిపోతారని కామెంట్ చేస్తున్నారు.

'ది ఘోస్ట్' ట్రైలర్ సినిమాపై కచ్చితంగా అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కాబోతోంది.