Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: పాత సీన్లే మళ్ళీ తీశారా?
By: Tupaki Desk | 7 Jun 2017 1:25 PM GMTబాహుబలి 1లో ఏం కనిపించాయో బాహుబలి 2 లో అవి కనిపించలేదు. అదే విధమైన ఫోజులూ.. కెమెరా వర్క్.. విజువల్ ఎఫెక్ట్స్ 2వ భాగంలో కనిపించకుండా చాలా జాగ్రత్తపడ్డాడు రాజమౌళి. అందుకే ఆ సినిమా సీక్వెల్ అంతగా సక్సెస్ అయ్యింది. ఇలాంటివన్నీ కళ్లారా చూస్తున్న ధనుష్ మాత్రం.. ఇప్పుడు ఈ డిఫరెన్స్ ను పెద్దగా గమనించినట్లు లేడు.
తనే స్వయంగా రాసిన ఒక ఎక్సటెన్షన్ కథతో ఇప్పుడు దర్శకత్వ బాధ్యతలు తన మరదలు సౌందర్యకు అప్పజెప్పి.. ''విఐపి 2'' అంటూ వస్తున్నాడు ఈ స్టార్ హీరో. ఇవాళ టీజర్ రిలీజైంది. అయితే సౌందర్య అలా తీసిందో.. ధనుష్ అలాగే చేశాడో.. లేదంటే మొదటి భాగంలో మిగిలిపోయిన ఫుటేజ్ తో మళ్ళీ ఒక టీజర్ కట్ చేశారో తెలియదు కాని.. అచ్చం విఐపి (తెలుగులో రఘువరణ్ బి.టెక్) తరహాలో ఉన్నట్లే ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ధనుష్ తండ్రి పాత్రధారి శత్రవులు ఉంటే మంచిది అదే మన ఎదుగుదలను ప్రామాణికం అంటూ క్లాస్ ఇస్తుండగా.. మనోడు గాల్లోకి ఎగిరి రౌడీలను ఇదివరకు తన్నినట్లే ఒక షాట్ పెట్టించుకున్నాడు.
అసలు ఈ సినిమాలో కాజోల్ తిరిగి సౌత్ ఇండియన్ సినిమాలో చాన్నాళ్ళ తరువాత చేయడం ప్రత్యేక ఆకర్షణ కాబట్టి.. ఆమె షాట్ ఏదైనా పెట్టుంటే బాగుండేదేమో. అది సంగతి.