Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ః వసుంధరతో విఐపి గొడవ
By: Tupaki Desk | 26 Jun 2017 7:05 AM GMTఇప్పుడు అందరూ ఆతృతగా ఎదురుచూస్తోంది 'విఐపి 2' ట్రైలర్ గురించే. ఎందుకంటే ఈ 'విఐపి' సినిమా ధనుష్ కెరయిర్లో ఈ మద్యన వచ్చిన ఒక బిగ్గెస్ట్ హిట్. అలాంటి సినిమాకు సీక్వెల్ గా వస్తున్న 'విఐపి 2' మామూలుగా చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. దానికితోడు సినిమాలో కాజోల్ చాన్నాళ్ళ తరువాత సౌత్ కు వస్తోంది అంటే ఇంకా పెద్ద సంచలనమే అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ట్రైలర్ ఎలా ఉంది?
రజనీకాంత్ చిన్నకూతురు సౌందర్య ఈ సినిమాలో మాస్ రఘువరణ్ (హీరో పేరు) క్యారెక్టర్ ను మొదటి భాగం తరహాలోనే బాగానే ఆవిష్కరించిందనే చెప్పాలి. ఇక ధనుష్ రాసిన మాటలు కూడా బాగానే ఉన్నాయి. మరోసారి ఇంజనీరుగా ఉద్యోగం పోగొట్టుకుని.. తనదైన శైలిలో ఉద్యోగ వేట ప్రారంభించే రఘువరణ్ ఆ క్రమంలో ఎన్నో కామెడీలు చేస్తాడు. అంతేకాదు.. మనోడు మళ్ళీ ఈసారి ఒక పెద్ద కనస్ర్టక్షన్ చేపను ఎదుర్కొంటాడు. ఈసారి ఆ పాత్రలో కాజోల్ నటించింది. వసుంధరగా ఆమె తన విలనీ బాగానే చూపించిందనే చెప్పాలి. అలాగే ధనుష్ కూడా మరోసారి తనదైన శైలితో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ మ్యూజిక్ కూడా అదిరింది. ముఖ్యంగా కాజోల్ ను మనోడు 'అమూల్ బేబి' అనే సీన్ అదిరింది.
గతంలో విఐపి సినిమాను తెలుగులో ఏ హీరో కూడా రీమేక్ చేయడానికి డేర్ చేయలేదు. స్రవంతి రవికిషోర్ రైట్స్ కొన్నా కూడా ఆయన తమ్ముడి కొడుకు రామ్ కూడా ఈ ప్రాజెక్టు వద్దనుకున్నాడు. చివరకు డబ్బింగ్ వర్షన్ 'రఘువరణ్ బి.టెక్' విడుదల చేస్తే.. పెద్ద హిట్టయ్యి కూర్చుంది. ఆ విషయం తెలుసుకున్న ధనుష్ ఇప్పుడు ఈ సినిమాను డైరక్టుగా తనే తెలుగులో కూడా దించేస్తున్నాడు. అది సంగతి.