Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: రాగిణి, సంజన కాల్ లిస్టులో వీఐపీలు

By:  Tupaki Desk   |   14 Sep 2020 5:30 PM GMT
డ్రగ్స్ కేసు: రాగిణి, సంజన కాల్ లిస్టులో వీఐపీలు
X
కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న డ్రగ్స్ కుంభకోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీని అరెస్ట్ చేశారు. వారి కాల్స్ డేటా, వాట్సాప్ సందేశాలను సేకరించారు.

ఈ డేటా విశ్లేషణలో వారిద్దరికీ అనేకమంది ప్రముఖులతో లింకులు ఉన్నట్టుగా గుర్తించారు. డ్రగ్స్ వ్యవహారం బయటపడిన తర్వాత రాగిణి, సంజన ఇద్దరూ తమ మొబైల్స్ లోని డేటాను మొత్తం డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

అయితే పోలీసులు సేకరించిన డేటాలో డ్రగ్స్ పార్టీల నిర్వహణ.. డ్రగ్స్ తో ఎంజాయ్ చేస్తున్న వ్యక్తుల ఫొటోలు, కాల్ రికార్డ్స్ ను పోలీసులు సేకరించారు. వీరు చేసుకునే పార్టీలకు డ్రగ్స్ తీసుకునేవారినే అనుమతిస్తారని సీసీబీ పోలీసులు తెలిపారు.

పోలీసులు ఇప్పటికే రాగిణిని మూడు సార్లు, సంజనను రెండు సార్లు కస్టడీకి తీసుకొని ప్రశ్నించారు. కస్టడీ సోమవారం ముగియడంతో వారు బెయిల్ పిటీషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.

సంజన డ్రగ్స్ తీసుకున్నట్టు సరఫరా చేసినట్టు పక్కా ఆధారాలు లభించడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.