Begin typing your search above and press return to search.

వైరల్ : నటి ట్వీట్.. మోడీ రీట్వీట్

By:  Tupaki Desk   |   18 Oct 2019 8:41 AM GMT
వైరల్ : నటి ట్వీట్.. మోడీ రీట్వీట్
X
సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్రమోడీ యమ యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.. తనకు పాపులారిటీ, క్రేజ్ తెచ్చే ఏ సందర్భాన్ని అయినా మోడీ క్యాష్ చేసుకొని మరింత పాపులారిటీ కోసం ప్రయత్నిస్తూనే ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగానే ఓ నటి తన కొడుకుతో కలిసి తీసిన వీడియోను ప్రధాని నరేంద్రమోడీ షేర్ చేసి ఆశ్చర్యపరిచాడు.

బాలీవుడ్ నటి గుల్ పనాగ్ తాజాగా తన ఏడాదిన్నర కొడుకు నిహాల్ కు ఓ మేగజైన్ కవర్ ముఖచిత్రంపై ఉన్న మోడీ బొమ్మను చూపించి ఈయన ఎవరో గుర్తు పట్టు అని అడుగుతుంది. దానికి ఆ బుడ్డోడు.. గుర్తుపట్టి 'మోడీ' అని చెప్పగా.. గుల్ పనాగ్ అలా అనకూడదని.. 'మోడీజీ' అని గౌరవ వాచకంగా చెప్పాలని సూచిస్తుంది..

ఇక ఈ వీడియోను నటి గుల్ పనాగ్ ట్వీట్ చేసింది. ఈ వీడియోను చూసిన మోడీ దీనిపై స్పందించాడు. 'చాలా గొప్ప విషయం.. చిన్నారి నిహాల్ కు నా ఆశీస్సులు అందజేస్తున్నా.. భవిష్యత్తులో నిహాల్ కోరుకుంటున్న లక్ష్యాలు చేరుకోవాలి.. గుల్ పనాగ్ ఓ మార్గదర్శకురాలని.. తల్లిలోని జడ్జిని గుర్తించాడు మీ కొడుకు అని మోడీ రీట్వీట్ చేశారు.

తాజాగా మోడీ ఈ వీడియో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. వీడియోకు 70వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. మోడల్, నటి అయిన గుల్ పనాగ్ పైలెట్ రిషీ అట్టారీని పెళ్లి చేసుకుంది. వీరికి గత ఏడాది నిహాల్ జన్మించాడు.

వీడియో కోసం క్లిక్ చేయండి
https://twitter.com/narendramodi/status/1184676930441940992