Begin typing your search above and press return to search.

వైరల్ పిక్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 75 ఫీట్ 'లైగర్' కటౌట్..!

By:  Tupaki Desk   |   20 July 2022 8:30 AM GMT
వైరల్ పిక్: ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 75 ఫీట్ లైగర్ కటౌట్..!
X
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా ''లైగర్''. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 25న థియేటర్లలోకి రాబోతోంది. రిలీజ్ కు ఇంకా నెల రోజులు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా రేపు జూలై 21న థియేట్రికల్ ట్రైలర్‌ ను లాంచ్ చేయనున్నారు.

'లైగర్' సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్‌ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అలానే అంతకుముందు వదిలిన టీజర్ మరియు గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రేపు రాబోతున్న థియేట్రికల్ ట్రైలర్‌ పై అందరి దృష్టి పడింది.

సౌత్ మరియు నార్త్ లో బజ్ క్రియేట్ చేయడం 'లైగర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్ మరియు ముంబై నగరాలలో గ్రాండ్ గా నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సుదర్శన్ థియేటర్ వద్ద అభిమానులు 75 అడుగుల భారీ విజయ్ దేవరకొండ కటౌట్ ను ఏర్పాటు చేశారు.

ఇది 'లైగర్' లో విజయ్ పోషించిన MMA బాక్సర్ పాత్రకు సంబంధించిన కటౌట్. ఇందులో ఇన్నర్ వేర్ లో నిలబడి ఉన్న వీడీ తన బాడీని ప్రదర్శిస్తున్నాడు.. ప్రౌడ్ గా ఇండియన్ ఫ్లాగ్ ని చూపిస్తున్నాడు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

విజయ్ ఫ్యాన్స్ సూపర్బ్ అని మెచ్చుకుంటుంటే.. యాంటీ వర్గం మాత్రం ట్రోల్ చేస్తున్నారు. ఇది కటౌట్ లా లేదని.. కట్ డ్రాయర్ యాడ్ లా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన VD న్యూడ్ ఫోటోపైనా ఇలాంటి వ్యాఖ్యలే వచ్చాయి. ఇదంతా చూస్తుంటే రిలీజ్ టైంకి అన్ని థియేటర్ల వద్ద విజయ్ దేవరకొండ సెమీ న్యూడ్ కటౌట్స్ కనిపిస్తాయేమో అని అంటున్నారు.

'లైగర్' సినిమాలో విజయ్ ఒక బాక్సర్ గా నటించారు. దీని కోసం చాలా కష్టపడ్డాడు. ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి కఠిన వర్కౌట్స్ చేస్తూ పర్ఫెక్ట్ బాడీని రెడీ చేసాడు. దానికి తగ్గట్టుగానే మేకర్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు కాబట్టి.. దీన్ని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని హీరో ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా డేర్ గా అలాంటి ఫోజులు ఇచ్చినందుకు వీడీ ని అభినందించాలని చెబుతున్నారు. ఇప్పటి వరకు తన పాత్ర స్వభావం ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించిన విజయ్.. థియేట్రికల్ ట్రైలర్ లో అంతకుమించి ఆకట్టుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఇప్పటి వరకూ 'లైగర్' ప్రమోషనల్ కంటెంట్ లో విజయ్ దేవరకొండ ఒక్కరే కనిపించగా.. రేపు రాబోయే ట్రైలర్ లో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ - హీరోయిన్ అనన్య పాండే తదితరులు భాగం కానున్నారు. హిందీ ట్రైలర్ లాంచ్ ముంబైలోని అంధేరిలోని సినీ పోలీస్‌ లో జరగనుండగా.. దీనికి బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని టాక్ వినిపిస్తోంది.

'లైగర్' సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది మేకర్స్ అధికారికంగా ప్రకటించ లేదు. ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ కు బ్యాగ్రౌండ్ స్కోర్ చేసింది ఎవరో వెల్లడించలేదు. అయితే ఇటీవల రిలీజ్ చేసిన 'అక్డి పక్డి' సాంగ్ ని బట్టి చూస్తే.. ఈ మూవీ కోసం మల్టిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారని సందేహాలు కలుగుతున్నాయి.

ప్రభాస్ హీరోగా నటించిన 'సాహో' చిత్రానికి కూడా ఇలానే పలువురు సంగీత దర్శకులు పని చేసారు. అలా ఒకే సినిమాకు ముగ్గురు నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు సంగీతం అందించే ఫార్ములా బాలీవుడ్ లో వర్కౌట్ అయింది కానీ.. టాలీవుడ్ లో పని చేయదని 'సాహో' మ్యూజిక్ కి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి చెప్పవచ్చు.

'లైగర్' ఆల్బమ్ మొత్తం లిజో జార్జ్ & డీజే చేతాస్ కలిసి చేశారా లేదా ఒక్కో పాటకు ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశాడా అనేది ట్రైలర్ లాంచ్ తో క్లారిటీ వస్తుందేమో చూడాలి.

పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై 'లైగర్' చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ - ఛార్మీ కౌర్ - కరణ్ జోహర్ - అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.