Begin typing your search above and press return to search.

వైరల్‌ : దిల్ రాజు డైలాగ్స్ ని వాడేసుకున్న తమిళ పోలీసులు

By:  Tupaki Desk   |   20 Jan 2023 2:30 PM GMT
వైరల్‌ : దిల్ రాజు డైలాగ్స్ ని వాడేసుకున్న తమిళ పోలీసులు
X
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మధ్య కాలంలో తెలుగు బయట కూడా సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆ మధ్య హిందీలో సినిమాలను నిర్మించిన దిల్‌ రాజు తాజాగా వారిసు సినిమా తో తమిళ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే. వారిసు సినిమాకు అనూహ్యంగా తమిళనాట భారీ కలెక్షన్స్ నమోదు అవుతున్నాయి.

ఈ సమయంలోనే దిల్ రాజు వారిసు సినిమా యొక్క ప్రమోషనల్‌ ఈవెంట్‌ లో భాగంగా మాట్లాడిన తమిళ మాటలు బాగా వైరల్ అయ్యాయి. తమిళం పెద్దగా రాకున్నా కూడా దిల్‌ రాజు చేసిన ప్రయత్నం ను అభినందించాల్సిందే. ఆ కార్యక్రమంలో దిల్‌ రాజు మాట్లాడిన మాటలను ఇప్పుడు తమిళనాడు తంజావూరు పోలీసులు కూడా వాడేసుకున్నారు.

దిల్ రాజు ఆ ఈవెంట్‌ లో తనకు వచ్చిన తమిళంలో డాన్స్ వేణుమా? డాన్స్ ఇరుకు (నీకు డ్యాన్స్ కావాలా? అది అక్కడే).. ఫైట్స్ వేణుమా? ఫైట్స్ ఇరుకు (మీకు ఫైట్లు కావాలా? అది కూడా అక్కడే) అంటూ ఆ సమయంలో వారిసు సినిమాపై అంచనాలు భారీగా పెంచాడు.

దిల్ రాజు మాట్లాడిన మాటలను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో తమిళ తంబీలు రకరకాలుగా మీమ్స్ ను క్రియేట్‌ చేసి దిల్‌ రాజు మాట్లాడిన మాటలకు కొత్త కొత్త పదాలను చేర్చారు.

తాజాగా తాంజావూరు పోలీసులు కూడా డ్రగ్స్ కు బానిస అయిన వారికి వార్నింగ్‌ గా దిల్‌ రాజు స్టైల్ లో వార్నింగ్ ఇచ్చారు. పోలీసు వారి పొంగల్ ఆఫర్‌ అంటూ.. కేసు వేణుమా? కేసు ఇరుకు, ఫైన్ వేణుమా? ఫైన్ ఇరుకు, జైలు వేణుమా? జైలు ఇరుకు.. మీ బ్యాంక్ ఖాతాలు ఆగిపోవాలా? మీ బ్యాంక్ ఖాతా కూడా ఆగిపోవును అంటూ డ్రగ్స్ తీసుకునే వారికి వార్నింగ్ ఇచ్చారు.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మధ్య కాలంలో పోలీసులు కాస్త తెలివిగా సినిమాటిక్ గా ఆలోచిస్తూ సోషల్‌ మీడియా ద్వారా పోస్ట్‌ లు పెడుతూ నేరాలు ఘోరాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే దిల్ రాజు డైలాగ్స్ ను తంజావూరు పోలీసులు వాడేసుకున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.