Begin typing your search above and press return to search.
ఫస్ట్ మీటింగ్ః సెటైర్ వేసిన కోహ్లీ.. ఎన్ కౌంటర్ చేసిన అనుష్క!
By: Tupaki Desk | 4 Aug 2021 11:30 PM GMTఒక జంట విషయంలో మొట్ట మొదటిసారిగా కలుసుకోవడం అనేది ఎప్పటికే స్పెషలే. ఒక లవ్ బర్డ్స్ విషయంలోనైతే చెప్పాల్సిన పనేలేదు. అదొక అద్భుతమైన మెమరబుల్ ఇన్సిడెంట్ గా గుర్తుండిపోతుంది. ఆ సంఘటనను తాజాగా గుర్తు చేసుకున్నాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
ప్రస్తుతం విరాట్ ఇంగ్లండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్ కోసం ఫ్యామిలీతో సహా వెళ్లిపోయారు క్రికెటర్స్. ఈ సిరీస్ ఆరంభానికి ముందు క్రికెటర్ దినేష్ కార్తిక్ తో మాట్లాడే క్రమంలో.. అనుష్క శర్మతో తన ఫస్ట్ మీటింగ్ గురించి చెప్పాడు. తమ మీటింగ్ కాస్త రివర్స్ అటాకింగ్ లోనే మొదలైందని తెలిపాడు.
''నేను అందరితో సరదాగా మాట్లాడుతాను. ఓ సారి అనుష్కను కలిసినప్పుడు ఆమె హై హీల్స్ చూసి జోక్ చేశాను. ఇంతకంటే.. ఎత్తు చెప్పులు దొరకలేదా? అని జోక్ చేశాను. అంతే.. ఒక్కసారిగా ఆమె సీరియస్ అయ్యింది. అంతేకాదు. నాపై పంచ్ కూడా వేసింది. నేనేమీ అరడుగులు లేను. అందుకే.. హై హీల్స్‌వేసుకున్నాను అని చెప్పింది'' అని తమ ఫస్ట్ మీటింగ్ ను గుర్తు చేసుకున్నాడు కోహ్లీ.
ఇక, తన కూతురి గురించి కూడా చెప్పాడు. తనను చూడకుండా ఉండలేనని భావోద్వేగానికి గురయ్యాడు. తనకు ఎంతో ఇష్టమైన తన తండ్రి ఈ లోకం లేరని, వామిక (కోహ్లీ కూతురు)ను చూడలేకపోయారని ఉద్వేగానికి లోనయ్యారు. అయితే.. తన తల్లి మాత్రం వామికతో ఎంతో సరదాగా ఆడుకుంటోందని చెప్పాడు కోహ్లీ. కాగా.. 2013లో ఓ షాంపూ ప్రకటనలో కోహ్లీ-అనుష్క శర్మ కలిసి నటించారు. ఆ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం, పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగిపోయాయి.