Begin typing your search above and press return to search.
విరుష్క జంటను ఏదో శక్తి ఆశీర్వదించిందట
By: Tupaki Desk | 11 Dec 2020 10:07 AM GMTఅనుష్క శర్మ- విరాట్ కోహ్లీ జోడీ ఆదర్శ జంటగా ప్రేమికుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ ముచ్చటైన జంట ఈ రోజు తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి భారత కెప్టెన్ కోహ్లీ వారి పెళ్లి రోజుకు సంబంధించిన ఫోటోను పంచుకున్నారు. అనుష్క శర్మ కూడా తమ ఆల్బమ్ నుంచి ఫోటోని షేర్ చేసుకుని త్వరలో తొలి బిడ్డకు వెల్ కం చెబుతున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
``మాకు 3 సంవత్సరాలు.. అతి త్వరలో మేం ముగ్గురం.. సంవత్సరాలు కలిసి జీవితకాలం ఇలా సంతోషంగా..`` అంటూ ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్ కం చెప్పారు. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీ జంటకు ఇటలీలో 11 డిసెంబర్ 2017న పెళ్లి జరిగింది. టుస్కానీలోని ఒక గ్రామీణ రిసార్ట్ లో బంధుమిత్రుల సమక్షంలో ఈ డెస్టినేషన్ వేడుక జరిగింది.
ఆ తర్వాత ప్రఖ్యాత వోగ్ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ, “మేం ఇంటి వద్ద జరుపుకున్నట్టే వివాహం చేసుకోవాలనుకున్నాం. అక్కడ 42 మంది మాత్రమే ఉన్నారు. మా స్నేహితులు కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. విరాట్ నేను వివాహం చేసుకోవడం బడా వెడ్డింగ్ అని కాదు కానీ... మా పెళ్లికి ఏదో అతీత శక్తి ఆశీర్వదించింది” అంటూ ఎమోషన్ కి గురయ్యారు.