Begin typing your search above and press return to search.
మ్యాచుల్లో దంచుతూనే అనుష్కపై ప్రేమ
By: Tupaki Desk | 20 April 2018 4:50 PM GMTఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ బ్యూటీ అనుష్కలు వివాహం చేసుకుని నాలుగు నెలలు దాటిపోయింది. పెళ్లికి ముందు నుంచి సోషల్ మీడియాలో తెగ హంగామా చేసిన ఈ జంట.. పెళ్లి వరకూ సైలెంట్ గా చేసుకున్నా.. ఆ తర్వాత మాత్రం మొత్తం ఫోటోలతో సహా విషయాన్ని వివరించేశారు.
ఇప్పుడు ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్న సందర్భంగా.. తన భర్త ఆడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతుగాను.. విరాట్ ను ప్రోత్సహిస్తూ.. అనుష్క శర్మ స్టాండ్స్ నుంచి చేసే హంగామా పలు మార్లు చూశాం. వీరి పెళ్లి తర్వాత అనుష్క తొలి మూవీ పరి రిలీజ్ సందర్భంగా.. విరాట్ ఎంతగా సపోర్ట్ చేశాడో కూడా చూశాం. అయితే.. కొన్ని వారాలుగా విరాట్ మాత్రం మ్యాచులతో ఫుల్లుగా బిజీ అయిపోయాడు. ఎంతలా అంటే.. తన ప్రియురాలితో కలిసి దిగిన ఫోటోను తాను నెట్ లో షేర్ చేసి నెలకు పైగా సమయం గడిచిపోయిన విషయాన్ని గుర్తించినట్లుగా ఉన్నాడు విరాట్.
అంతే తామిద్దరం కలిసి దిగిన ఓ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన విరాట్.. 'ఎంత స్టన్నింగ్ గా ఉందో కదా.. లవ్ ఆఫ్ మై లైఫ్' అంటూ ఓ క్యాప్షన్ పెట్టాడు. నిజంగానే ఈ ఇద్దరి జంట మరీ చూడముచ్చటగా ఉంది. ఇటు విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం ఇంకో నెలకు పైగా కష్టపడాల్సి ఉండగా.. వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న మూవీతో అనుష్క శర్మ బిజీగా ఉంది.