Begin typing your search above and press return to search.
'ఏయ్ కోహ్లీ.. చౌకా మార్.. చౌకా.. క్యా కరా రే’
By: Tupaki Desk | 17 April 2020 12:30 PM GMTకరోనా వైరస్ వ్యాప్తి నివారణకు యావత్ దేశం లాక్ డౌన్ పాటిస్తుండటంతో నిత్యం రకరకాల పనులతో బిజీగా ఉండే క్రీడాకారులు - సినిమా సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. మామూలుగానైతే ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా.. విహార యాత్రలకో లేక వీధుల్లోనో షికార్లు కొట్టే వాళ్లు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం లాక్ డౌన్ దశలో ఉండటంతో గడప దాటి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాని సెలబ్రిటీలు.. క్వారంటైన్ పేరిట తమకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా మే 3 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో మరి కొన్ని రోజులు ఇంటికే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇక విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ విషయానికొస్తే ఇంట్లోనే ఉంటూ వీరిద్దరూ లాక్ డౌన్ ను ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా అలరిస్తూనే ఉన్నారు. మాములుగా విరాట్ కోహ్లి క్రికెట్ మైదానంలో దిగితే అటు పరుగుల మోత మోగిస్తూ.. ఆపోజిట్ టీమ్ పై దూకుడు చూపిస్తూ ఉండాలి. కానీ కోహ్లి ఇప్పుడు ఇంట్లో లాక్ అయిపోయాడు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో క్రీడా ఈవెంట్లు ఏమీ జరగడం లేదు. దాంతో అభిమానులకు కోహ్లి ఆట దూరమై పోయింది.
ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ.. 'ఏయ్ కోలీ.. చౌకా మార్.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది. అనుష్క అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 'కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ ని మిస్ అవుతున్నాడు.. దాంతో పాటు అతని ఫ్యాన్స్ ని కూడా మిస్ అవుతున్నాడు... ముఖ్యంగా ఈ విధంగా ఎంకరేజ్ చేసే ఫ్యాన్స్ ని బాగా మిస్ అవుతున్నదంటూ' కామెంట్ జత చేసింది. ఇటీవల కోహ్లికి న్యూ హెయిర్ కట్ ట్రై చేసిన అనుష్క శర్మ.. ఇప్పుడు తాజాగా కోహ్లీని ఇలా ఆట పట్టించింది. మొత్తం మీద ఈ 'విరుష్క' జంట లాక్ డౌన్ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.