Begin typing your search above and press return to search.
ఆ ప్రేమజంటకు డిసెంబర్లో పెళ్లి?
By: Tupaki Desk | 13 Nov 2017 7:26 AM GMTభారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి.. బాలీవుడ్ భామ అనుష్క శర్మ నాలుగేళ్లకు పైగా ప్రేమలో ఉన్నారు. మొదట్లో వీళ్లిది మామూలు బంధమే అనుకున్నారు. ఇద్దరూ టైంపాస్ చేస్తున్నట్లుగా కనిపించారు. కానీ తర్వాత సీన్ మారింది. ఇద్దరూ సీరియస్ రిలేషన్‌షిప్‌లోకి దిగిపోయారు. మధ్యలో బ్రేకప్ జరిగి కొన్ని నెలలు దూరంగా ఉండి కూడా, ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ కలిసిపోయారు. దీంతో వీరి బంధం మరింత బలపడింది. ఇద్దరూ పెళ్లికి కూడా రెడీ అయిపోయారు. ఈ ఏడాది చివర్లో వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్లుగా ఇప్పుడు గట్టి ప్రచారమే జరుగుతోంది. డిసెంబర్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి వీళ్లిద్దరూ ప్రణాళికలు రచిస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
క్రికెటర్ గా విరాట్ రేంజేంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అనుష్క శర్మ కూడా బాలీవుడ్లో స్టార్ హీరోయినే. వీళ్లిద్దరి పెళ్లి ఇక్కడ చేస్తే సెలబ్రెటీలే వందల్లో వస్తారు. అందుకే ఏ హడావుడీ లేకుండా ఫారిన్లో కుటుంబ సభ్యులు.. కొద్దిమంది బంధువులు.. అత్యంత సన్నిహితుల మధ్య ప్రశాంతంగా పెళ్లి చేసుకోవాలని ఈ జంట భావిస్తోందట. శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ఆడాక.. వన్డేలు టీ20ల నుంచి విరాట్ తప్పుకుంటాడని.. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. ఆ తర్వాత కొంత విరామం ఇచ్చి జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తాడని అంటున్నారు. అనుష్కతో పెళ్లికి విరాటే ముందు నుంచి తొందరపెడుతున్నాడని.. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తి కొంత కాలం విడిపోయారని.. ఈ ఏడాది పెళ్లి చేసుకోవడానికి అనుష్క అంగీకరించాకే ఇద్దరూ మళ్లీ దగ్గరయ్యారని గతంలో ప్రచారం జరిగింది.