Begin typing your search above and press return to search.

కోహ్ల-అనుష్క.. మస్కా కొట్టబోతున్నారా?

By:  Tupaki Desk   |   7 Dec 2017 6:12 AM GMT
కోహ్ల-అనుష్క.. మస్కా కొట్టబోతున్నారా?
X
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. శ్రీలంకతో వన్డే.. టీ20 సిరీస్ ల నుంచి విశ్రాంతి తీసుకోవడం ఆలస్యం.. అతడి పెళ్లి గురించి పుకార్లు మొదలైపోయాయి. ఇటీవలే భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్.. ప్రస్తుత జట్టు సభ్యుడు భువనేశ్వర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోహ్లి కూడా వీరి బాటలోనే సాగబోతున్నాడని.. అనుష్కను వివాహమాడబోతున్నాని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇండియాలో హడావుడి ఎందుకని.. ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవడానికి వీళ్లిద్దరూ సిద్ధపడినట్లు ఓ ప్రముఖ నేషనల్ డైలీ కథనం ప్రచురించింది. దీనిపై నిన్నట్నుంచి సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది.

ఐతే కోహ్లితో అనుష్క పెళ్లి గురించి వస్తున్న వార్తలు అబద్ధమంటూ అనుష్క ప్రతినిధి మీడియాకు ఖండన ఇచ్చేశాడు. అయినంతమాత్రాన ఈ పెళ్లి అబద్ధమని అనుకోవడానికి లేదు. కోహ్లి, అనుష్కలకు ఉన్న పేరు ప్రఖ్యాతుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ నేపథ్యంలో వారి పెళ్లి విదేశాల్లో అన్నా కూడా మీడియాలో తెగ హడావుడి జరుగుతుంది. అక్కడ కూడా వారి పెళ్లిని ప్రశాంతంగా చేసుకోనివ్వరు. కాబట్టి పెళ్లి వార్తలు అబద్ధమని కొట్టి పారేస్తూనే.. సైలెంటుగా పెళ్లి చేసుకుని వచ్చేసే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అనుష్కతో పెళ్లి విషయంలో కోహ్లి ముందు నుంచే తొందరపడుతున్నాడు. కానీ అనుష్కే సినిమా కెరీర్ దెబ్బ తింటుందన్న ఉద్దేశంతో పెళ్లి వాయిదా వేయిస్తున్నట్లు చెబుతున్నారు. మధ్యలో కొంత కాలం ఇద్దరూ దూరం కావడానికి ఈ గొడవే కారణమని కూడా వార్తలొచ్చాయి. ఐతే కోహ్లి ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే అని పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. మరి నిజంగా ఈ నెలలో వీరి పెళ్లి జరుగుతుందో లేదో చూద్దాం.