Begin typing your search above and press return to search.

అనుష్క భుజంపై కోహ్లి చెయ్యి వేసి..

By:  Tupaki Desk   |   4 Jan 2017 10:49 AM GMT
అనుష్క భుజంపై కోహ్లి చెయ్యి వేసి..
X
మన దేశంలో యూత్ ను అమితంగా ఆకర్షించే అంశాల్లో ఒకటి క్రికెట్ అయితే.. ఇంకోటి సినిమా. మరి ఈ క్రికెట్.. సినిమా మిక్స్ అయితే మజాకు లోటేముంటుంది? అందుకే విరాట్ కోహ్లి-అనుష్క శర్మల జంట ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షనే. ఈ జంట నిరంతరం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముందు ప్రేమ.. ఆపై బ్రేకప్.. ఇప్పుడు మళ్లీ ప్రేమ.. మొత్తానికి వీరి కథలో చాలా మలుపులే ఉన్నాయి.

ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ అనంతరం దొరికిన గ్యాప్ లో అనుష్కతో కలిసి విరాట్ విహార యాత్రకు వెళ్లడం గురించి పెద్ద చర్చే నడిచింది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో వీళ్లిద్దరి జంట కెమెరాలకు చిక్కి కనువిందు చేసింది. అలాగే ఓ స్వామీజీతో కలిసి ఉన్న ఫొటో కూడా చర్చనీయాంశమైంది. విరాట్-అనుష్కల నిశ్చితార్థానికి రంగం సిద్ధమవుతోందన్న వార్తలు పుట్టడానికి కూడా ఆ ఫొటోలే కారణం. ఇవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇప్పుడు డెహ్రాడూన్లో విరాట్-అనుష్క విహరిస్తుండగా ఓ అభిమాని తీసిన ఫొటోలు మరింతగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈ ఫొటోలో అనుష్క భుజంపై చెయ్యి వేసి విరాట్ ఏదో మాట్లాడుతున్నట్లుగా ఉంది. విరాట్.. అనుష్క ఇలా క్యాజువల్ గా ఉన్న ఫొటో ఇంతకుముందెన్నడూ చూసింది లేకపోవడంతో ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు తమ బంధం గురించి విరాట్.. అనుష్క కూడా పెద్దగా దాపరికాలేమీ పాటించట్లేదు. డెహ్రూడూన్లో ఒకే ప్లేస్ నుంచి విడివిడిగా అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ చెబుతూ తామిద్దరం ఒకే చోట ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/