Begin typing your search above and press return to search.
ఇన్ స్టాతో కోట్లు సంపాదిస్తున్న కోహ్లీ.. పీసీ
By: Tupaki Desk | 25 July 2019 5:38 AM GMTఒకప్పుడు సెలబ్రెటీలకు వారి ఫ్రొఫెషన్ ద్వారా మాత్రమే డబ్బులు వచ్చేవి. కాని ప్రస్తుతం సెలబ్రెటీలకు అనేక వైపుల నుండి డబ్బే డబ్బు. కాస్త తెలివిగా ఆలోచిస్తే సోషల్ మీడియా ద్వారా కోట్లు కురుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సెలబ్రెటీలు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో లక్షలు.. కోట్లల్లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఎక్కువ ఫాలోవర్క్ కలిగి ఉన్న సెలబ్రెటీలతో కంపెనీలు తమ బ్రాండ్స్ కు ప్రమోషన్ చేయించుకునేందుకు ఆసక్తి చూపిస్తాయి. ఒక కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా నటించడంతో వచ్చే డబ్బులు మాత్రమే కాకుండా తమ సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేయడం ద్వారా అదనంగా డబ్బు వసూళ్లు చేస్తున్నారు.
ఇన్ స్టాగ్రామ్ ద్వారా అత్యధిక డబ్బు సంపాదిస్తున్న వారి జాబితాను హప్పర్.కామ్ అనే వెబ్ సైట్ లెక్కలతో సహా ప్రచురించింది. వారు ఇచ్చిన వివరాల ప్రకారం విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాలో ఏదైనా ప్రమోషనల్ వీడియో పోస్ట్ చేసేందుకు రూ. 1.32 కోట్ల రూపాయలను పారితోషికంగా వసూళ్లు చేస్తాడు. ఇక 43 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్న ప్రియాంక చోప్రా తాను పోస్ట్ చేసే ప్రమోషనల్ వీడియోకు గాను 1.86 కోట్ల రూపాయలను పారితోషికంగా అందుకుంటుంది.
అమెరికాకు చెందిన కైలీ జెన్నర్ 141 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. ఆయన ఏదైనా పోస్ట్ ను షేర్ చేస్తే ఏకంగా 8.7 కోట్ల రూపాయలను పారితోషికంగా పొందుతూ నెం.1 స్థానంలో నిలిచాడు. 1.86 కోట్లతో 19వ స్థానంలో ఉండగా, కోహ్లీ 23వ స్థానంలో ఉన్నాడు. ఇండియన్ నుండి వీరిద్దరు మాత్రమే ఈ జాబితాలో చోటు సంపాదించారు.