Begin typing your search above and press return to search.
కింగ్ ఖాన్ దాటేసిన కొత్త పెళ్లికొడుకు
By: Tupaki Desk | 21 Dec 2017 6:14 AM GMTగత కొన్నేళ్లుగా షారూక్ ఖాన్ సినిమాలు ఆడకపోయి ఉండవచ్చు. హిట్ అనిపించుకున్న సినిమాలు కూడా మంచి వసూళ్లు సాధించకపోవచ్చు. అయినా సరే కింగ్ ఖాన్ ప్లేస్మెంట్ కి ఇప్పటివరకూ వచ్చిన ఇబ్బందేమీ లేదు. సినిమాల పరంగా కాకపోయినా.. మోస్ట్ వాల్యుబుల్ లిస్ట్ లో అగ్రస్థానంలోనే ఉన్నాడు షారూక్.
సినిమాలతోపాటు కమర్షియల్ ఎండార్స్ మెంట్స్.. ఐపీఎల్ వంటివి షారూక్ ను అగ్రస్థానంలో నిలిపాయి. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ.. షారూక్ స్థానానికి ఎసరు పెట్టేశాడు. రైజ్ ఆఫ్ మిలినియల్స్.. ఇండియాస్ మోస్ట్ వాల్యుబుల్ సెలబ్రిటీ బ్రాండ్స్ లిస్ట్ లో చాలా సంవత్సరాలుగా షారూక్ తొలి స్థానంలోనే ఉంటున్నాడు. కానీ ఈ ఏడాది ఆ అగ్రస్థానాన్ని విరాట్ కోహ్లీ తన్నుకుపోయాడు. దేశీయ సెలబ్రిటీల నెట్ వర్త్ ను డఫ్ అండ్ ఫెల్ప్స్ అంచనా వేసి ర్యాంకింగ్స్ ఇవ్వగా.. ఇందులో 144 మిలియన్ డాలర్లతో.. తొలి స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ. సెకండ్ ప్లేస్ కి పరిమితం అయిన షారూక్ ఖాన్ నెట్వర్త్ 106 మిలియన్లు.
ఇక్కడ షారూక్ బ్రాండ్ వాల్యూ పెద్దగా తగ్గలేదు కానీ.. కొత్త పెళ్లి కొడుకు అయిన విరాట్ వాల్యూ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఆ జోరు చూపించడంలో షారూక్ విఫలం అయ్యాడంతే. ఇక ఈ లిస్ట్ లో మూడో ప్లేస్ లో నిలిచిన దీపిక పదుకొనే బ్రాండ్ వాల్యూ 93 మిలియన్ డాలర్లు కాగా.. 47 మిలియన్ డాలర్లతో అక్షయ్ కుమార్ నాలుగో స్థానంలోను.. 42 మిలియన్ డాలర్ల వాల్యూతో రణవీర్ సింగ్ 5వ ప్లేస్ లోను నిలిచారు.