Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ లో కోహ్లీ చేసిన అతి పెద్ద పని

By:  Tupaki Desk   |   27 July 2020 12:30 AM GMT
లాక్‌ డౌన్‌ లో కోహ్లీ చేసిన అతి పెద్ద పని
X
టీం ఇండియా క్రికెటర్లు ఏడాదిలో 80 శాతంకు పైగా క్రికెట్‌ ఆటతోనే బిజీగా ఉంటారు. విదేశాల్లో లేదంటే స్వదేశంలో ఏదో ఒక టోర్నీ ఉంటూనే ఉంది. ప్రతి ఏడాది సమ్మర్‌ లో ఐపీఎల్‌ కారణంగా దాదాపుగా రెండు నెలలు బిజీ బిజీగా గడిపేస్తారు. కాని కరోనా కారణంగా ఏకంగా నాలుగు నెలల నుండి టీం ఇండియా క్రికెటర్స్‌ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐసీసీ టోర్నమెంట్స్‌ తో పాటు పలు సిరీస్‌ లను కూడా రద్దు చేశారు. దాంతో ఈ నాలుగు నెలలు కూడా టీం ఇండియా ఆటగాళ్లు ఇంట్లోనే టైంను స్పెండ్‌ చేశారు. ఈ లాక్‌ డౌన్‌ టైంను విరాట్‌ ఎలా గడిపాడు అనే విషయాన్ని మయాంక్‌ అగర్వాల్‌ రాబట్టే ప్రయత్నం చేశాడు.

మయాంక్‌ తో సాగిన ఫన్నీ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను కోహ్లీ వెళ్లడి చేశాడు. ముఖ్యంగా ఈ లాక్‌ డౌన్‌ లో తనకు అతి పెద్ద అచివ్‌మెంట్‌ అంటే అనుష్క బర్త్‌ డేకు సొంతంగా కేక్‌ తయారు చేయడం. తాను జీవితంలో ఫస్ట్‌ టైం కేక్‌ తయారు చేశాను. మొదటి ప్రయత్నమే అయినా బాగానే వచ్చింది. అనుష్క కూడా కేక్‌ ను మెచ్చుకుని తనకు ఈ కేక్‌ చాలా ప్రత్యేకమైనది అంటూ చెప్పడం నాకు సంతోషాన్ని కలిగించిందని కోహ్లీ అన్నాడు.

ఇక ఈ ఖాళీ టైంను ఎక్కువగా బుక్స్‌ చదువుతూ వర్కౌట్స్‌ చేస్తూ అప్పుడప్పుడు సినిమాలు చూస్తే గడిపేశానంటూ చెప్పుకొచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కుటుంబ సభ్యులకు సమయం కేటాయించానంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ మ్యాచ్‌ లు సెప్టెంబర్‌ 9 నుండి ప్రారంభం కాబోతున్నాయి. ఈసారి ఐపీఎల్‌ కు యూఏఈ ఆతిథ్యం ఇవ్వబోతుంది.