Begin typing your search above and press return to search.

అమ్మకి.. అనుష్కకి.. నా శుభాకాంక్షలు

By:  Tupaki Desk   |   8 March 2017 8:06 AM GMT
అమ్మకి.. అనుష్కకి.. నా శుభాకాంక్షలు
X
స్టార్ క్రికెటర్.. భారత క్రికెట్ జట్టు కెప్టెన్.. విరాట్ కొహ్లీ ఇప్పుడు ఉమెన్స్ డే నాడు కూడా సంచలనాలకు కేంద్ర బింధువయ్యాడు. ఆల్రెడీ నిన్న ఆస్ర్టేలియాపై ఉత్కంఠభరిత పోరులో టెస్టు మ్యాచును గెలిచి అభిమానులకు ఫుల్ కిక్కిచ్చిన విరాట్.. ఈరోజు తన ఉమెన్స్ డే శుభాకాంక్షలు మెసేజ్ తో పిచ్చెక్కించాడు. అమ్మకు అనుష్కకు అంటూ తన లవ్వర్ గురించి కూడా ఓపెన్ గా మాట్లాడేయటంతో.. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యకరంగా ఉంది.

''మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ముఖ్యంగా నా జీవితంలోని ఇద్దరు ముఖ్యమైన బలమైన మహిళలకు చెబుతున్నాను. ముందుగా మా అమ్మ.. మా లైఫ్‌ లో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఫ్యామిలీని కాపాడుకుంటూ వచ్చింది. ఆ తరువాత అనుష్క. ఎన్నో ఎదురీతలు ఈది.. చివరకు పోరాడి.. ఇక్కడి పద్దతులను మార్చేస్తున్న వనిత'' అంటూ తన సోషల్ నెట్వర్క్ ఎకౌంటులో పోస్ట్ చేశాడు విరాట్ కొహ్లీ.

మనోడు ఇలా పోస్ట్ పెట్టాడో లేదో.. వెంటనే అందరూ సో స్వీట్ అంటూ కామెంట్ల వర్షంతో ముంచెత్తారు. ముఖ్యంగా గత వాలెంటైన్స్ డే నాడు మనోడు అనుష్క ఫోటోను పెట్టి తీసేశాడని రభస చేసిన జనం.. ఇప్పుడు అటు అమ్మ ఇటు అనుష్క అంటూ ట్వీటు వేయడంతో.. అందరూ కాస్త ఖుషీ అయినట్లున్నారు. మొత్తానికి విరాట్ అండ్ అనుష్కను జంటగా చూడాలని అందరికీ ఎంత తహతహో చూశారా!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/