Begin typing your search above and press return to search.
మెగాస్టార్ చిరంజీవి అభిమాని విరాట్ కోహ్లీ
By: Tupaki Desk | 13 July 2022 9:55 AM GMTమెగాస్టార్ చిరంజీవికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. భారతదేశంలోని లెజెండరీ నటులలో ఒకరిగా ఆయనకు జాతీయ స్థాయిలో అభిమాన సంఘాల ఫాలోయింగ్ ఉంది.
ప్రపంచ దేశాల్లో అభిమానుల నిరంతర సేవా కార్యక్రమాల గురించి అందరికీ సుపరిచితం. భారీ మాస్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న స్టార్ గా చిరుకి ప్రత్యేక స్థానం ఉంది. చిరుని అభిమానులు తమ ఆరాధ్య దేవుడిగా కొలుస్తారు.
కేవలం మాస్ .. కామన్ అభిమానులేనా సెలబ్రిటీల్లోనూ చిరు గొప్ప ఫాలోయింగ్ అభిమానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ డ్యాన్సుల్లోని గ్రేస్ కి వీరాభిమానులున్నారు. భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు ద్వారకా రవితేజ ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ద్వారకా రవితేజ - విరాట్ కోహ్లీ ఇద్దరూ వారి U-15 రోజులలో రూమ్ మేట్స్ గా ఉన్నారు. రవి టీవీలో చిరంజీవి పాటలు చూసేవాడు.. కోహ్లీ వాటికి డ్యాన్స్ చేసేవాడు. అప్పటి నుండి ఇద్దరూ తమను తమ పేర్లతో ఎప్పుడూ పిలుచుకోలేదు. చిరును తమ మారుపేరుగా పెట్టుకున్నారు. ఆ క్షణం నుంచి ఇద్దరూ కలిసినప్పుడల్లా 'చిరు' అనే పిలుచుకునేవారట.
ఇంగ్లండ్ సిరీస్ కోసం యూకే వెళ్లిన కోహ్లీని ద్వారకా రవి కలిశాడు. ఆరేళ్ల తర్వాత భేటీ ఇలా కుదిరింది. ''చిరును చూడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలో మళ్లీ కలుస్తానని ఆశిస్తున్నాను'' అని రాస్తూ పోస్ట్ ను ముగించాడు.
ఈ పోస్ట్ కొద్ది సేపటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చిరు గురించి ద్వారకా వద్ద కోహ్లీ ప్రస్థావించడం ఆసక్తికరం. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరుకి కోహ్లీ వీరాభిమాని అన్న సంగతి బయటపడింది.