Begin typing your search above and press return to search.

ఓపెన్ గా ముద్దులు కూడా పెట్టేసుకున్నారు

By:  Tupaki Desk   |   4 Jun 2016 10:05 AM IST
ఓపెన్ గా ముద్దులు కూడా పెట్టేసుకున్నారు
X
విడిపోయిన జంట ఒక్కటైంది. పగిలిన గుండె అతుక్కుంది. ఎవరి దారిన వాళ్లు ఉందామన్న బ్రేకప్ కాస్తా ప్యాచప్ అయినట్లుగా క్లియర్ కట్ గా తేలిపోయింది. విరహవేదనను.. నిచ్చెలి ఎడబాటును సోషల్ మీడియాలో చెప్పుకొని సానుభూతి సంపాదించిన విరాట్ కోహ్లీ ఎట్టకేలకు.. తన ప్రియురాలి అనుష్క శర్మ మనసును మరోసారి దోచేసుకున్నారు. ఇద్దరి మధ్య లవ్ గేమ్ ఫినిష్ అన్న మాట కొద్ది నెలల క్రితంచోటు చేసుకుంటే.. వారి లవ్ బ్రేక్ కు తమకు తామే రిపేర్లు చేసుకొని మళ్లీ ఒక్కటైన విషయం ఓపెన్ అయ్యింది.

బ్రేకప్ ను సోషల్ మీడియాలో పంచుకున్న విరాట్ కోహ్లీ.. తమ మధ్య మరో లవ్ గేమ్ మొదలైందన్న విషయాన్ని ఓపెన్ గానే ఎక్స్ ప్రెస్ చేశారు. సుల్తాన్ షూటింగ్ కు వెళ్తున్న ప్రియురాలు అనుష్కను ముంబయి ఎయిర్ పోర్ట్ దగ్గర స్వయంగా దింపిన అతగాడు.. తన ప్రాణసఖిని విడిచి వెళుతున్న వేళ.. ఘాటు ముద్దును ఇచ్చి పంపటం గమనార్హం. అందరూ చూస్తున్నా.. తమ ఇద్దరిని కెమేరాలతో బంధిస్తున్నారన్న విషయం తెలిసినా.. కారులో ముద్దు ముచ్చటను కానిచ్చేసి బుడాపెస్ట్ కు పంపటం చూసినప్పుడు కోహ్లీ.. అనుష్కల జంట మళ్లీ ఒక్కటైనట్లు కన్ఫర్మ్ చేసుకున్నట్లే.ఈ జంట మళ్లీ ఒక్కటి కావాలంటూ కోరుకున్న వారికిది తీపి వార్తే. ఎడబాటును సోషల్ మీడియాలో పంచుకున్న కోహ్లీ.. కలిసిపోయామన్న విషయాన్ని తమ ముద్దు ముచ్చటతో ఓపెన్ గా చెప్పేయం బాగానే ఉందని చెప్పాలి.