Begin typing your search above and press return to search.
కోహ్లీకి కెప్టెన్సీ అయినా ఉందా? లేదా?
By: Tupaki Desk | 13 Feb 2020 5:30 PM GMTఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సోషల్ మీడియా పేజీల్లో కోహ్లీ ఫొటోలను తొలగించడంతో పాటు జట్టు పేరును మార్చడం జరిగింది. మామూలుగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో జట్టు కెప్టెన్ నిర్ణయం తప్పనిసరిగా తీసుకుంటూ ఉంటారు. కాని రాయల్ ఛాలెంజర్స్ మాత్రం తమ జట్టు కెప్టెన్ అయిన కోహ్లీని కనీసం సంప్రదించలేదు. పేర్ల మార్పు మరియు ఫొటోల తొలగింపుపై కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారిగా విజేతగా నిలువలేక పోయింది. ఆ కారణంగానే జట్టు యాజమాన్యం ఇలా ప్రవర్తించి ఉండవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫొటోలు తీశారు.. పేరు మార్చారు సరే కాని ఇంతకు కోహ్లీ కెప్టెన్సీ ఉందా లేదా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం టీం ఇండియా కెప్టెన్ గా ఉన్న కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలగిస్తే కోహ్లీకి అంతకు మించిన పరువు తక్కువ ఉండదు. రాయల్ ఛాలెంజర్స్ అంత పని చేయక పోవచ్చు. కాని గతంలో మాదిరిగా ఆయనకు గౌరవం ఇవ్వడం మరియు ప్రాముఖ్యత ఇవ్వడం తగ్గించాయంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయమై కోహ్లీ మీడియా ముందుకు వచ్చి ఎలా స్పందిస్తాడో చూడాలి.