Begin typing your search above and press return to search.

అనుష్క 'టీ' వివాదం.. కోహ్లీ సీరియస్

By:  Tupaki Desk   |   1 Dec 2019 2:49 PM IST
అనుష్క టీ వివాదం.. కోహ్లీ సీరియస్
X
మొన్నటి ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో సెలెక్టర్ల బాక్సులో కూర్చున్న భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీ అందించి ఓ సెలెక్టర్ సపర్యలు చేశాడని భారత మాజీ క్రికెటర్ ఫరూక్ చేసిన ఆరోపణలు సంచలనమైన సంగతి తెలిసిందే. దీనిపై కోహ్లీ, అనుష్క శర్మలను అందరూ తిడుతున్నారు. సోషల్ మీడియాలోనూ ట్రోల్ చేస్తున్నారు.

దీనిపై అనుష్క శర్మ కూడా క్లారిటీ ఇచ్చింది. తనకు ఏ సెలెక్టర్ టీ అందించలేదని.. ఫరూక్ అబద్దపు ఆరోపణలు చేశాడని క్లారిటీ ఇచ్చింది.

ఇన్నాళ్లు అనుష్క శర్మ టీ వివాదంపై సైలెంట్ గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా సీరియస్ అయ్యారు. ఆ మ్యాచ్ లో అసలు తన భార్య సెలెక్టర్ల బాక్సులోనే కూర్చోలేదని వివరణ ఇచ్చారు. తన స్నేహితులతో కలిసి ఫ్యామిలీ బాక్సులో కూర్చుందని.. సంచలనం కోసమే తన భార్య అనుష్కపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సెలెక్టర్లను విమర్శించాలనుకుంటే తిట్టండని.. కానీ నా భార్య అనుష్కను ఎందుకు తీసుకొస్తున్నారని కోహ్లీ మండిపడ్డారు.

కొందరు సంచలనాల కోసం అనుష్క శర్మ చుట్టూ వివాదాలు అల్లుతున్నారని.. మేం వాటిని పట్టించుకోవడం లేదని కోహ్లీ స్పష్టం చేశారు.