Begin typing your search above and press return to search.
విరాట పర్వంలో విప్లవ ప్రేమ?
By: Tupaki Desk | 17 Jun 2019 4:40 AM GMTరెండు రోజుల క్రితం వెంకటేష్ క్లాప్ తో సింపుల్ గా ప్రారంభమైన రానా కొత్త సినిమా విరాట పర్వం ఇంకొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. ఆరేడు నెలల గ్యాప్ తర్వాత సాయి పల్లవి చేస్తున్న తెలుగు స్ట్రెయిట్ మూవీ కావడంతో దీని మీద మరికొన్ని అంచనాలు ఏర్పడ్డాయి. యూనిట్ తాజాగా విడుదల చేసిన థీమ్ పోస్టర్ ఆసక్తి రేపెలా ఉండటంతో దర్శకుడు వేణు ఊడుగుల ఏ కాన్సెప్ట్ తీసుకుని ఉంటాడా అనే దాని మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి.
ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఇది 90 దశకం నేపధ్యంలో వస్తుంది. రానా రాజకీయ నాయకుడిగా సాయి పల్లవి విప్లవంతోనే సమాజంలో మార్పు వస్తుందని నమ్మే అభ్యుదయ భావాలు కలిగిన యువతిగా కనిపిస్తారట. రెండు భిన్న ధ్రువాలుగా కనిపించే ఈ పాత్రలు ప్రేమించుకోవడమే విరాట పర్వంలో అసలు హై లైట్ అని చెబుతున్నారు. అంతే కాదు ఇద్దరు ఒకరికొకరు తమ దారులను మార్చుకోమని ప్రేరేపించే క్రమం కూడా చాలా ఆసక్తికరంగా రాసుకున్నట్టు తెలిసింది
ఈ కారణంగానే సాయి పల్లవితో పాటు రానా విరాట పర్వంకు ఓకే చెప్పారట. బడ్జెట్ కూడా కొంత ఎక్కువ మొత్తంలోనే కేటాయించబోతున్నట్టు తెలిసింది. అప్పటి సెటప్ కాబట్టి కొంత ఆర్ట్ వర్క్ ఎక్కువగా అవసరం పడుతుంది. ఆ మేరకు నిర్మాతలు పక్కా ప్లానింగ్ తో ఉన్నట్టు వినికిడి. ఇప్పటికే రానా పొలిటీషియన్ గా లీడర్ నేనే రాజు నేనే మంత్రిలో చేశాడు. కాని వేణు ఊడుగుల వాటితో పోలిక రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. పీరియాడిక్ డ్రామా పరంగా ఇదో కొత్త తరహా ఫీలింగ్ కలిగించేలా విరాట పర్వం ఉంటుందట. పోస్టర్ చూస్తుంటే ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి మరి. చూద్దాం