Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' డబుల్ డిజాస్టర్ దిశగా పయనిస్తోందా..?
By: Tupaki Desk | 22 Jun 2022 2:30 AM GMTహ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి మరియు నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ''విరాటపర్వం'' సినిమా గత శుక్రవారం థియేటర్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. 1990స్ నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో విలక్షణ దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కించారు.
'విరాటపర్వం' సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. దీంతో కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుందని అందరూ భావించారు. అయితే కంటెంట్ పరంగా అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
మొదటి వారాంతంలో ఈ సినిమా యావరేజ్ వసూళ్లతోనే సరిపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ లో రూ.3.14 కోట్ల షేర్ కలెక్షన్స్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇక వీక్ డేస్ లో ఈ సినిమాకు భారీ డ్రాప్స్ కనిపిస్తున్నాయి.
'విరాటపర్వం' సినిమాకు విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ అయింది. అలానే సాయి పల్లవి పాత్రపై విపరీతమైన హైప్ ఏర్పడింది. ఇక ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడంతో కొన్ని రోజులు ఈ సినిమా వార్తల్లో నిలిచింది. అయితే ఇవేవీ సినిమా ఓపెనింగ్స్ కు ఉపయోగపడలేదని అర్థం అవుతోంది.
కరోనా పాండమిక్ నేపథ్యంలో వాయిదా పడుతూ రావడంతో.. అన్నీ కలిపి 'విరాటపర్వం' చిత్రానికి బాగానే ఖర్చు చేశారు. సినిమాపై అంచనాలకు తగ్గట్టుగానే రూ. 14 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు బాక్సాఫీస్ వసూళ్ళు చూస్తుంటే వేరేలా ఉన్నాయి.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే.. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం అసాధ్యమనే అనిపిస్తుంది. హిట్ స్టేటస్ పక్కన పెడితే.. డబుల్ డిజాస్టర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని కామెంట్స్ ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.
నాన్ థియేట్రికల్ రైట్స్ తో నిర్మాతలు సేఫ్ అవ్వొచ్చేమో కానీ.. కొన్ని ఏరియాల్లో బయ్యర్లు భారీ నష్టాలు అందుకోవాల్సి వస్తుందని అంటున్నారు. పోటీలో క్రేజీ మూవీస్ ఏమీ లేవు కాబట్టి.. ఈ వీకెండ్ వరకూ 'విరాటపర్వం' సాధిస్తుందో లేదో.. లాంగ్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
'విరాట పర్వం' చిత్రాన్ని స్వచ్ఛమైన ప్రేమకు నక్సలైట్ ఉద్యమాన్ని జోడించి తెరకెక్కించిన దర్శకుడికి ప్రశంసలు దక్కుతున్నాయి. సరళ అనే తెలంగాణా మహిళ నిజ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్స్ ను తెర మీదకు తీసుకొచ్చిన నిర్మాతలను అభినందిస్తున్నారు.
ఇందులో విప్లవం కోసం జీవించే కామ్రేడ్ రవన్న పాత్రలో రానా దగ్గుబాటి నటించగా.. ప్రేమ కోసం ఎంత దూరమైనా వెళ్లే అమ్మాయి వెన్నెల పాత్రలో సాయి పల్లవి ఆకట్టుకుంది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. డి. సురేష్ బాబు సమర్పణలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మించారు.