Begin typing your search above and press return to search.
నక్సలైట్ సీతక్క నిజజీవిత పాత్రనా?
By: Tupaki Desk | 4 Jun 2020 4:15 AM GMTరానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకుడు. సాయిపల్లవి కథానాయిక. సీనియర్ నాయిక ప్రియమణి ఈ చిత్రంలో నక్సలైట్ గా నటిస్తున్నారు. తాజాగా ప్రియమణి బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజైంది.
ఈ పోస్టర్ లో ప్రియమణి చిరునవ్వులు చిందిస్తూ ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. అయితే నక్సల్ జీవితం అంటే ఇలాంటి ప్రశాంతత ఎప్పుడూ ఉంటుందా? బ్లాస్ట్ లు.. ఎన్ కౌంటర్లతో అడవులు దద్ధరిల్లే సన్నివేశం ఉంటుంది. అందుకే బ్లాక్ డ్రెస్ తో పాటుగా భారీ ఆయుధాల్ని మోస్తూ కనిపించింది. ఇక ప్రియమణి పాత్రకు స్ఫూర్తి ఏదైనా ఉందా? అంటే రియల్ లైఫ్ మహిళా నక్సలైట్ సీతక్క స్ఫూర్తి ఉందని చెబుతున్నారు. దళకమాండర్ గా సీతక్క పేరు అప్పట్లో మార్మోగేది. ఆ రియల్ లైఫ్ రోల్ నే వేణు ఉడుగుల స్ఫూర్తి పొంది రాసుకున్నారా? అందుకే ఆ పాత్రకు కామ్రేడ్ సీతక్క అని నామకరణం చేశారా? అన్నది తనే చెప్పాలి. ఇక ఎప్పుడూ యుద్ధవాతావరణం కనిపించే నక్సలైట్స్ గ్రూపులో శాంతి ప్రభోధకురాలిగా కనిపిస్తూనే అంతర్గత కలహాల్ని నివారించి ఐకమత్యం కోరే సీతక్క కనిపిస్తుందని చెబుతున్నారు.
పోస్టర్ ఆకట్టుకుంది. జాతీయ ఉత్తమనటి ప్రియమణి నటనా వైవిధ్యం గురించి చెప్పాల్సిన పనే లేదు కాబట్టి ఆ పాత్ర సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందనే అభిమానులు భావిస్తున్నారు. రానా ఈ చిత్రంలో జర్నలిస్ట్ కం పోలీస్ ఇన్ఫార్మర్ గా లేదా రెడ్ స్టార్ గా కనిపిస్తారని ప్రచారమైంది. సాయి పల్లవి పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని డి సురేష్ బాబుతో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.