Begin typing your search above and press return to search.
ఎమోషనల్ ట్రైలర్ తో అంచనాలు పెంచిన 'విరాటపర్వం'
By: Tupaki Desk | 16 Jun 2022 5:45 AM GMTతెలుగులో సాయిపల్లవి ఇంతవరకూ హీరో జోడీగానే మెప్పిస్తూ వచ్చింది. కాకపోతే ఆమె పాత్రకి ఎలాగూ ప్రాధాన్యత ఉండేది. నాయిక ప్రధానమైన పాత్రలో ద్విభాషా చిత్రంగా వచ్చిన 'కణం' సినిమాలో మాత్రమే కనిపిస్తుంది. ఇక 'విరాటపర్వం' విషయానికి వస్తే. ఇది ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందిన సినిమా. ఆ సంఘటనలోని వ్యక్తి ఉండగానే ఆమె పాత్రను పోషించడం సాయిపల్లవికి ఇది ఫస్టు టైమ్. ఇలాంటి ఒక సినిమాలో నటించడమనేది అంతే తేలికైన విషయమేం కాదు. జనంలో నుంచి వచ్చిన పాత్రను జనం మధ్యలోకి తీసుకుని వెళ్లి ఒప్పించడం నిజంగా ఒక సవాలు లాంటిదే.
దర్శకుడు వేణు ఉడుగుల తాను చూస్తూ పెరిగిన వాతావరణాన్నీ .. పరిస్థితులను తెరపైకి తీసుకునిరావడానికి చేసిన ప్రయత్నమే ఈ సినిమా. ఈ కథ పెద్ద నిర్మాతల చేతుల్లోకి వెళ్లడం .. రానా - సాయిపల్లవి వంటి ఆర్టిస్టులు దొరకడం వలన నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. రేపు ఈ సినిమా విడుదలవుతుండగా .. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేదికపై సాయిపల్లవి పాత్రను ప్రధానంగా చేసుకుని కట్ చేసిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆమె 'వెన్నెల' పాత్రలో కనిపిస్తుంది. వెన్నెల బర్త్ సీన్ కి సంబంధించిన సన్నివేశంపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా ఉంది.
అది అటవీ ప్రాంతం .. దానిని ఆనుకుని ఉన్న పల్లెటూరు అది. పోలీసులకు .. నక్సలైట్లకు అనునిత్యం పోరాటం జరిగే ప్రదేశం అది. అలాంటి పరిస్థితుల్లో ఒక రాత్రివేళలో ఒక స్త్రీ పురిటి నెప్పులతో బాధపడుతూ ఉంటే .. ట్రాక్టర్ పై ఆమెను హాస్పిటల్ కి తీసుకుని వెళుతుంటారు. కొంతదూరం వెళ్లగానే పోలీసులకు .. నక్సల్స్ కి మధ్య జరిగే కాల్పుల్లో వాళ్లు చిక్కుకుంటారు. అప్పుడు ఓ లేడీ నక్సలైట్ తన ప్రాణాలకు తెగించి .. ఆ స్త్రీకి పురుడు పోస్తుంది.
తన బిడ్డకు ప్రాణం పోసిన ఆమెనే పేరు పెట్టమని ఆ తండ్రి ఆ లేడీ నక్సలైట్ ను కోరతాడు. అప్పుడు ఆమె అడవిని వెన్నెలనిచ్చే చందమామను చూస్తూ 'వెన్నెల'అనే పేరు పెడుతుంది. ఆ క్షణమే పోలీసుల తూటా తగలడంతో ఆమె నేలకూలిపోతుంది.
వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్ - ఈశ్వరీరావు నటిస్తే, లేడీ నక్సలైట్ గా నివేదా పేతురాజ్ కనిపించింది. వెన్నెల పోరాటంలోనే పుట్టింది .. పోరాటంలోనే పెరిగింది .. పోరాటం ఆమెకి కొత్తకాదు అనే విషయాన్ని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తుంది. సినిమా విడుదలకి దగ్గరలో ఇలాంటి ఒక ఎమోషనల్ ట్రైలర్ రిలీజ్ చేయాలనే ఆలోచన బాగుంది.
ఇది ప్రతి ఒక్కరికీ వెంటనే కనెక్ట్ అయ్యే సీన్. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచే సీన్ అని చెప్పచ్చు. ఈ ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో రానా పేరు రవన్న .. అంటే ఉదయించే సూర్యుడికి సంకేతంగా ఆ పేరు పెట్టారు. అలాగే అడవిలోని చీకట్లను పారద్రోలే వెన్నెల పేరు సాయిపల్లవి పాత్రకి పెట్టడం దర్శకుడి ప్రతిభాపాటవాలకు నిదర్శనంగానే చెప్పుకోవాలి.