Begin typing your search above and press return to search.
'విరాటపర్వం' ట్రైలర్ ఎప్పుడంటే..!
By: Tupaki Desk | 3 Jun 2022 5:30 PM GMTరానా.. సాయి పల్లవి ల విరాటపర్వం సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. దాదాపుగా మూడు సంవత్సరాలుగా ఈ సినిమా వార్తల్లో ఉంటుంది. ఎన్నో కారణాల వల్ల సినిమా ఆలస్యం అయ్యింది. నెలల క్రితం పూర్తి అయిన ఈ సినిమాను ఎట్టకేలకు థియేటర్ రిలీజ్ కు సిద్దం చేశారు. కరోనా సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ప్రముఖ ఓటీటీ ల నుండి భారీ ఆఫర్లు వచ్చాయి. అయినా కూడా థియేటర్ రిలీజ్ కు విరాటపర్వం సినిమాను తీసుకు వచ్చారు. ఇప్పటికే సినిమా పై ఒక వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ట్రైలర్ ను రెడీ చేసి విడుదలకు సిద్దం చేశారు. ఈనెల 5వ తారీకున ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ట్రైలర్ విడుదల పోస్టర్ కూడా చాలా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉండటంతో సినిమా పై ఆసక్తి మరింతగా పెరుగుతోంది.
రానా ను చూపించకుండా కేవలం సాయి పల్లవిని మరియు ఆయన చేతిలో ఉన్న గన్ ను మాత్రమే చూపించడం ద్వారా దర్శకుడు తన క్రియేటివిటీని ప్రదర్శించాడు. సాయి పల్లవి తన ప్రేమ కోసం చేసే ఉద్యమం ఒక అద్బుతం అన్నట్లుగా ఉంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. విడుదలకు సరిగ్గా రెండు వారాలు ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల స్పీడ్ పెరుగుతోంది.
ఇప్పటికే పాటలు మరియు పోస్టర్ లు విడుదల చేసి ఉద్యమ నేపథ్యం సినిమా అంటూ చెప్పకనే చెప్పారు. ఇది ఒక కమర్షియల్ మూవీగా కూడా ఉంటుందని ట్రైలర్ ద్వారా చెప్పే అవకాశాలు ఉన్నాయి. సాయి పల్లవి సినిమా ప్రమోషన్ కోసం వారం రోజుల పాటు హైదరాబాద్ కు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.
వేణు ఉడుగుల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ను సురేష్ బాబు తో కలిసి సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. నక్సల్స్ ఉద్యమ నేపథ్యం లో రూపొందిన ఈ సినిమా లో కీలక పాత్రలో ప్రియమణి కనిపించబోతుంది. సినిమాలోని సాహిత్యం మరియు డైలాగ్స్ ప్రతి ఒక్కరి మనసుకు హత్తుకునేలా ఉంటాయంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.