Begin typing your search above and press return to search.
వర్జిన్ స్టోరి టీజర్: వాడు చైతన్య నేను సమంత!
By: Tupaki Desk | 31 Oct 2021 12:45 PM GMTనిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి.. రేసు గుర్రం.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్. ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ లో కీలక పాత్లో నటిస్తున్నారు. విక్రమ్ హీరోగా నటించిన తొలి మూవీ వర్జిన్ స్టోరి. కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్ బి అట్లూరి ఈ చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో టీజర్ ను విడుదల చేశారు. నేటితరం మెచ్చే యూత్ ఫుల్ కంటెంట్ తో సాగే చిత్రమిది. టీనేజీ యువతరం నడవడిక స్పీడ్ పై తెరకెక్కించారు. స్కూల్ కాలేజ్ యూత్ ని థియేటర్లకు రప్పించే కంటెంట్ టీజర్ లో కనిపిస్తోంది. విక్రమ్ సహిదేవ్.. అంతగా పరిణతి చెందని టీనేజర్ గా ఈ చిత్రంలో కనిపించనున్నాడు. సౌమిక పాండియన్ గ్లామర్ ప్రధాన అస్సెట్. ఈ ఉత్తరాది బ్యూటీ హీరోతో లిప్ లాకుల్లో అద్భుతంగా రాణించింది. హీరో హీరోయిన్ ప్రైవసీ వెతుకుతూ అతిధి గృహాల్లో తమను తాము పరిచయం చేసుకుంటూ నాగచైతన్య- సమంత. .. విరాట్ - అనుష్క అంటూ ఫన్ ని క్రియేట్ చేయడం నేటితరం ప్రవర్తనకు అద్దంపడుతుంది.
లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. ``వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమా అని చెప్పొచ్చు. అంటే టీనేజ్ ప్రేక్షకుల నుంచి 20 ఇయర్స్ వరకు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం వెతుకుతున్నారు. ఒక అమ్మాయి మంచి అబ్బాయి కోసం, .. అబ్బాయి మంచి అమ్మాయి కోసం,.. వాళ్ల స్నేహం, ప్రేమను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు అద్దం పట్టే సినిమా ఇది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ వర్జిన్ స్టోరి చిత్రంలో చక్కగా చూపించారు దర్శకుడు ప్రదీప్. త్వరలోనే థియేటర్ లలో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం`` అన్నారు.
దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ..దర్శకుడు శేఖర్ కమ్ముల గారి సినిమాలు చూసి ఇన్ స్పైర్ అవుతుంటాను. వర్జిన్ స్టోరి సినిమాను నా జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించాను. విక్రమ్ లాంటి ప్యాషన్ ఉన్న హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదృష్టం. ప్రతి సీన్ కు సాధన చేసేవాడు. తన పూర్తి ప్రయత్నంతో నటించేవాడు. విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుంది. అన్నారు.
దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ…శ్రీధర్ నాకు చాలా కాలంగా స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమాలంటే ఇష్టం. నేనే కాదు ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్ తో సినిమాలు చేస్తుంటారు. నేనూ అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా చేస్తున్నారు. వర్జిన్ స్టోరి టీజర్.. పాటలు చూశాను. చాలా బాగున్నాయి. విక్రమ్ చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరి సినిమా నచ్చుతుంది. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్... అన్నారు. పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అచు రాజమణి, సినిమాటోగ్రఫీ - అనీష్ తరుణ్ కుమార్.