Begin typing your search above and press return to search.

యూత్ ను టార్గెట్ చేస్తున్న 'వర్జిన్ స్టోరీ'

By:  Tupaki Desk   |   17 Feb 2022 3:54 AM GMT
యూత్ ను టార్గెట్ చేస్తున్న వర్జిన్ స్టోరీ
X
ప్రముఖ నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ''వర్జిన్ స్టోరి''. ఇంతకుముందు 'రుద్రమదేవి' 'రేసు గుర్రం' 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు విక్రమ్. ఇటీవల 'రౌడీ బాయ్స్' చిత్రంలో చేసిన పాత్రకు మంచి పేరు వచ్చింది.

ఈ క్రమంలో ఇప్పుడు ''వర్జిన్ స్టోరీ'' సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్ సాహిదేవ్. ముందుగా ఈ చిత్రానికి 'కొత్తగా రెక్కలొచ్చెనా..' అనే టైటిల్ పెట్టారు. అయితే ఆ పేరు మరీ క్లాస్ గా ఉందని అనుకున్నారో ఏమో.. యూత్ ను ఆకట్టుకునేలా టైటిల్ ను మార్చారు. ముందు పెట్టిన టైటిల్ ను ట్యాగ్ లైన్ చేశారు.

''వర్జిన్ స్టోరీ'' చిత్రానికి ప్రదీప్ బి అట్లూరి దర్శకత్వం వహించారు. గౌరవ్ లగడపాటి సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష - శ్రీధర్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 18న ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది.

ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన 'వర్జిన్ స్టోరీ' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ - పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. నేటి యువతరం భావోద్వేగాలకు అద్దంపట్టేలా.. వారి ఆలోచనలకు ప్రతిబింబంలా.. సహనం ఉంటేనే ప్రేమ దక్కుతుందనే పాయింట్ తో ఈ సినిమా రూపొందింది.

స్వచ్ఛమైన ప్రేమను పొందాలన్నా.. కోరుకున్న కెరీర్ ను దక్కించుకోవాలన్నా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేమకు అసలు పరీక్ష ఏమిటనేది ఈ సినిమాలో చూపించబోతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇది యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ చేసిన ప్రత్యేకమైన సినిమా అని ప్రచారం చేస్తున్నారు.

కరోనా థర్డ్ వేవ్ తర్వాత యువతను టార్గెట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'డీజే టిల్లు' సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ శుక్రవారం రాబోతున్న ''వర్జిన్ స్టోరీ'' కూడా టీనేజర్స్ ను యూత్ ని ఆకర్షించగలిగితే.. మంచి విజయం అందుకునే అవకాశం ఉంది.

కాగా, 'వర్జిన్ స్టోరి' చిత్రంలో విక్రమ్ సహిదేవ్ సరసన సౌమిక పాండియన్ - రిషిక ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అచ్చు రాజమణి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేశారు. రాఘవేంద్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.