Begin typing your search above and press return to search.

విరూపాక్ష నుంచి నచ్చావులే నచ్చావులే సాంగ్ రిలీజ్..!

By:  Tupaki Desk   |   24 March 2023 10:07 PM GMT
విరూపాక్ష నుంచి నచ్చావులే నచ్చావులే సాంగ్ రిలీజ్..!
X
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తాజాగా నటించిన తాజా చిత్రం విరూపాక్ష గురించి అందరికీ తెలిసిందే. అయితే సుకుమార్ రైటింగ్స్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. అయితే ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగా.. విశేష స్పందన లభించింది. ఈ ఊపులోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం.

అయితే నచ్చావులే.. నచ్చావులే.. ఏరోజు చూసానో ఆరేజే.. అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఇందులో సాయి ధరమ్ తేజ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. అలాగే హీరోయిన్ సంయుక్తా మీనన్ కూడా అదిరపోయే లుక్ లో ఎంట్రీ ఇచ్చింది. అయితే సంయుక్తా మీనన్.. ఈ సినిమాలో నందిని అనే క్యారెక్టర్ లో అచ్చమైన పల్లెటూరి అమ్మాయిలా కనిపించబోతుంది.

ఈ పాటలో పల్లెటూరి అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోయిన సాయి ధరమ్ తేజ్.. ఆమెను ఆకట్టుకునే విధానం అందరినీ మెప్పిస్తుంది. ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. సెన్సేషనల్ సింగర్ కార్తీక్ ఈ పాటను చాలా బాగా పాడారు. అయితే ఈ పాన్ ఇండియా సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 21వ తేదీన తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తీసుకురాబోతున్నారు.

మిస్టరీ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తుండగా.. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అయితే సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం సుకుమార్ కథ, కథనం అందించారు. హీరోగా సాయి ధరమ్ తేజ్ 15వ సినిమా ఇది.

అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల అయింది. అజ్ఞానం భయానికి మూలం, భయం మూఢ నమ్మకానికి కారణం, ఆ నమ్మకమే నిజం అయినప్పుడు? ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనప్పుడు, అసలు నిజాన్ని చూపించే మరో నేత్రం అంటూ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో విరూపాక్ష గ్లింప్స్ విడుదలైంది. అయితే ఈ గ్లింప్స్ కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రాలతో పాటు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందరిలోనూ మరి ఆసక్తిని కల్గజేశాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.