Begin typing your search above and press return to search.

'పుష్ప‌' బాట‌లో నార్త్ కు వెళుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌!

By:  Tupaki Desk   |   15 Dec 2022 2:30 AM GMT
పుష్ప‌ బాట‌లో నార్త్ కు వెళుతున్న సాయి ధ‌ర‌మ్ తేజ్‌!
X
టాలీవుడ్ యంగ్ హీరో, మెగా మేన‌ల్లుగా సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ `విరూపాక్ష‌`. కార్తీక్ దండు ద‌ర్శ‌కుడు. బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ తో క‌లిసి స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ టైటిల్ ని ప్ర‌క‌టిస్తూ టైటిల్ గ్లింప్స్ ని మేక‌ర్స్ రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. SDT15 ప్రాజెక్ట్ గా వ‌స్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ వీడియో ఇప్ప‌టికే నెట్టింట వైర‌ల్ అవుతోంది. సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

లేటెస్ట్ సెన్సేష‌న్ `కాంతార‌` మూవీకి సంగీతం అందించిన అంనీజ్ లోక్ నాథ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ కు స్టార్ హీరో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న ప‌వ‌ర్ పుల్ వాయిస్ తో వాయిస్ ఓవ‌ర్ అందించ‌డం విశేషం. ప్ర‌స్తుతం ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ నెట్టింట వైర‌ల్ గా మారి సంద‌డి చేస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా త‌మిళ వెర్ష‌న్ టైటిల్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. బుధ‌వారం హిందీ వెర్ష‌న్ కి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. టైటిల్ గ్లింప్స్ గంభీరమైన వాయిస్ తో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. `కాంతార` సంగీత ద‌ర్శ‌కుడు అంజ‌నీష్ లోక్ నాథ్ అందించిన నేప‌థ్య సంగీతం సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లేలా క‌నిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప‌` బాట‌లో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది.

`పుష్ప ది రైజ్‌` మూవీని ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు చేరువ చేసిన గోల్డ్ మైన్స్ సంస్థ సాయిధ‌ర‌మ్‌ తేజ్ న‌టిస్తున్న పాన్ ఇండియా మూవీ `విరూపాక్ష‌`ని రిలీజ్ చేయ‌బోతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ ఈ మూవీని 2023 ఏప్రిల్ 23న రిలీజ్ చేస్తున్న‌ట్టుగా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీకి సుకుమార్ నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తూనే స్క్రీన్ ప్లే స‌మ‌కూరుస్తుండ‌టం విశేషం. ఇందులోని కీల‌క పాత్ర‌ల్లో బ్ర‌హ్మాజీ, అజ‌య్‌, సునీల్ న‌టిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.