Begin typing your search above and press return to search.
ప్రశాంతమైన సరస్సు చెంత విరుష్క..?
By: Tupaki Desk | 29 Nov 2021 11:30 AM GMTఓవైపు ఆటలో అలసిపోయినా మరోవైపు విహార యాత్రలతో రిలాక్స్ అవుతున్నారు విరాట్ కోహ్లీ. భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ నిరంతరం ప్రయాణాలను ఆస్వాధిస్తున్న సంగతి తెలిసిందే. తమ యాత్రలకు సంబంధించిన ప్రతిదీ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూనే ఉన్నారు. ఈ జంట తమ జీవితాల్లో ఒకరికోసం ఒకరుగా ఉన్నారు.
కోహ్లీ తన లేడీ లవ్ అనుష్కతో ఉన్న ఫోటోని తాజాగా షేర్ చేశాడు. నీతో పాటు.. నేను ఎక్కడైనా ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా.. అంటూ వ్యాఖ్యానించాడు. ఈ జంట ప్రశాంతమైన సరస్సును చూస్తూ ప్రకృతిని ఆస్వాధిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. దానికి అనుష్క నుంచి స్పందన బావుంది. ``మీరు ఇంట్లో లేనందున ఇది చాలా బాగుంది`` అంటూ నవ్వుతున్న ఎమోటికాన్ లను అనుష్క జోడించింది.
భార్యా భర్తలే అయినా ఎంతో స్నేహంగా ఉండే అనుష్క శర్మ- విరాట్ జోడీ .. ఎంతో సన్నిహితంగా.. సౌకర్యవంతంగా మెలగడం ప్రతిసారీ చూసేదే. ఈ హ్యాపీ కపుల్ ఫోటో అభిమానుల్లోకి దూసుకెళ్లింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. చివరిసారిగా `జీరో`లో కనిపించిన అనుష్క సుదీర్ఘ విరామం తీసుకుంది. తదుపరి కొన్ని సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం నవదీప్ సింగ్ కనేడా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ తో బిజీగా ఉంది. నిర్మాతగా పలు భారీ చిత్రాల్ని నిర్మించేందుకు అనుష్క శర్మ ప్రణాళికల్లో ఉన్నారని సమాచారం.