Begin typing your search above and press return to search.

మీ అమ్మ, అక్కతో అలా అనగలవా?

By:  Tupaki Desk   |   10 Jun 2015 11:30 AM GMT
మీ అమ్మ, అక్కతో అలా అనగలవా?
X
నారా రోహిత్‌ సరసన రౌడీ ఫెలో చిత్రంలో కథానాయికగా నటించింది విశాఖ సింగ్‌. తొలిచిత్రంతోనే చక్కని నటి అన్న పేరు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో ఒక్క సినిమాకి కూడా సంతకం చేయలేదు ఈ అమ్మడు. ఇటీవలే కేన్స్‌ ఫిలింఫెస్టివల్‌ కమిటీలో ఓ మెంబర్‌గా ఎంపికై అక్కడ సందడి చేసింది. సినిమాల స్క్రీనింగ్‌లో పాలుపంచుకుంది.

కేన్స్‌ సంబరాల నుంచి తిరిగొచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం చేతిలో ఉన్న బాలీవుడ్‌ ప్రాజెక్టు 'ఫక్రీ'లో నటిస్తోంది. అయితే ఆననలైననలో ఈమ్మడిని కొందరు ఆకతాయిలు దారుణంగా వేదించడం మొదలుపెట్టారు. ఫేసనబుకనలో ఈ అమ్మడి ఫోటో కింద కామెంట్లలో బూతు పదాల్ని ఉపయోగించారు. నైస్‌ లుకింగ్‌ అండ్‌ నైస్‌ బ్రెస్ట్‌ అంటూ కామెంట్‌ పెట్టాడు సదరు పోకిరి. దాంతో ఫైరైన విశాఖ సింగ్‌.. నీ అమ్మ అక్క, చెల్లి దగ్గరికి వెళ్లి ఇలా అనగలవా? అని ప్రశ్నించింది. నేను ఆమ్మాయిని. నాకు స్థనాలు ఉన్నాయి. ప్రతి మహిళకు ఇవి ఉంటాయి. నా ముందుకి వచ్చి ఇలా అనగలవా? ఒకవేళ దమ్ముంటే నీ ఒరిజినల్‌ ఫోటోని ఫేస్‌బుక్‌లో పెట్టు.. అంటూ సీరియస్‌ అయ్యింది.

ఇన్ని గట్స్‌ ఉన్నాయి కాబట్టే విశాఖసింగ్‌కి కేన్స్‌లో అంత గొప్ప సదవకాశం దక్కిందన్నమాట! తెలంగాణ శకుంతల తర్వాత మళ్లీ విశాఖసింగ్‌నే ఫైర్‌ బ్రాండ్‌ అని పిలవాలేమో! అయినా మహిళల్ని తక్కువ చూపు చూసే అలాంటివాళ్లకు తగిన శాస్తి చేసి శభాష్‌ అనిపించుకుంది. విశాఖ ది గ్రేట్‌.