Begin typing your search above and press return to search.
అవార్డు సినిమాకు ఇన్నాళ్లకు మోక్షం
By: Tupaki Desk | 4 Feb 2019 6:38 AM GMTకొన్ని సినిమాలు అనుకోకుండా పాపులారిటీని దక్కించుకుంటాయి. తమిళంలో 2015లో వచ్చిన 'విసారణై' చిత్రం ఒక చిన్న చిత్రంగా రూపొందింది. తమిళనాడుకు చెందిన చంద్ర కుమార్ అనే ఆటో డ్రైవర్ రాసిన నవల ఆధారంగా ప్రముఖ తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు ముందే పలు ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడింది. అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. జాతీయ స్థాయిలో అవార్డులు దక్కించుకున్న ఈ చిత్రం ఆస్కార్ కు కూడా ఇండియా నుండి నామినేట్ అయ్యింది. ప్రేక్షకులు కూడా ఈ చిత్రంను ఆధరించి, మంచి కలెక్షన్స్ ను ఇచ్చారు.
తమిళనాడుకు చెందిన నలుగురు అమాయకులైన కుర్రాళ్లను కొన్ని కారణాల వల్ల ఏపీ పోలీసులు పట్టుకుంటారు. వారిని రకరకాల కేసుల్లో ఇరికించి వారిని చిత్రహింసలు పెడతారు. ఆ తర్వాత వారిని తమిళనాడు పోలీసులకు అప్పగిస్తారు. తమిళ పోలీసులు కూడా ఆ కుర్రాళ్లకు నరకం చూపిస్తారు. అమాయకులైన ఆ కుర్రాళ్లు ఎందుకు పోలీసుల చేతికి చిక్కారు, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటీ అనేది సినిమాలో చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎక్కువగా చిత్రీకరించారు. సినిమాలో చాలా సీన్స్ లో తెలుగు మాటలు ఉంటాయి. తెలుగు వారికి అర్థం అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో డబ్ చేస్తున్నారు.
'విచారణ' టైటిల్ తో ఈ చిత్రాన్ని డబ్ చేశారు. మూడు సంవత్సరాల క్రితం ఈ సినిమాను తెలుగులో డబ్ చేయాలని భావించినప్పటికి కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. ఇప్పుడు తెలుగులో డబ్ చేసి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రంను ఈ వారంలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ స్పీడ్ పెంచారు. ఈ చిత్రంలో కీలక పాత్రలో అజయ్ ఘోష్, సముద్రఖనిలు నటించారు. తమిళ ప్రేక్షకుల మెప్పుపొందిన విచారణ తెలుగు వారిని మెప్పిస్తుందా చూడాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ పెద్దగా ఉండని ఈ చిత్రం తెలుగు ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.