Begin typing your search above and press return to search.
వీడియో: 'నాట్ ఏ కామన్ మ్యాన్' కోసం రిస్కీ ఫైట్స్ చేస్తున్న విశాల్..!
By: Tupaki Desk | 17 Jun 2021 6:30 AM GMTకోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తన 31వ సినిమా 'నాట్ ఏ కామన్ మ్యాన్' షూటింగ్ ను కరోనా సెకండ్ వేవ్ పాండమిక్ నేపథ్యంలో హైదరాబాద్ లో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో '#Vishal31' చిత్రీకరణ స్టార్ట్ చేసిన మేకర్స్.. జూలై చివరి నాటికి సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ప్రకటించారు. అయితే తాజాగా ఈ షెడ్యూల్ లో షూట్ చేసిన ఓ యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన బిహైండ్ ది సీన్ వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇందులో హీరో విశాల్ ను కొందరు రౌడీలు బీరు సీసాలతో కొడుతున్నారు. ఈ క్రమంలో ఒకరు విసిరిన బాటిల్ విశాల్ కంటికి బాగా బలంగా తగిలింది. అది షూటింగ్ లో భాగంగా కాకుండా నిజంగానే విశాల్ కంటికి తగిలినట్లు వీడియో చూస్తుంటే అర్థమవుతోంది. రియల్ యాక్షన్ అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి విశాల్ రిస్కీ ఫైట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టంట్ కొరియోగ్రఫర్ రవి వర్మ సారధ్యంలో ఈ యాక్షన్ సీక్వెస్ కి చిత్రీకరిస్తున్నారు.
'నాట్ ఏ కామన్ మ్యాన్' చిత్రానికి తూ.పా. శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. బాలసుబ్రమనియం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఎన్బీ శ్రీకాంత్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఎస్ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.