Begin typing your search above and press return to search.

అభిమన్యుడు గెలిచేస్తున్నాడు!!

By:  Tupaki Desk   |   4 Jun 2018 3:29 PM IST
అభిమన్యుడు గెలిచేస్తున్నాడు!!
X
మహాభారతంలో కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహాన్ని ఛేదించడంలో విజయం సాధించిన అభిమన్యుడు.. బయటకు రావడం తెలియక మరణిస్తాడు. కానీ డబ్బింగ్ సినిమాగా వచ్చిన విశాల్ అభిమన్యుడు మాత్రం.. కలెక్షన్స్ పద్మవ్యూహాన్ని గెలిచేట్లుగానే కనిపిస్తున్నాడు.

నాగార్జున మూవీ ఆఫీసర్.. రాజ్ తరుణ్ సినిమా రాజుగాడుతో పోటీగా అభిమన్యుడు రిలీజ్ చేయడాన్ని.. అందరూ అనుమానించారు. కానీ ఆ రెండు సినిమాలు పేలిపోవడం.. ఇదే సమయంలో అభిమన్యుడు మూవీ కంటెంట్ తో అదరగొట్టడం బాగా కలిసొచ్చింది. సన్నివేశాల్లో చూపించకపోయినా.. విజయ్ మాల్యా అక్రమాలతో సామాన్యుల బ్యాంక్ బాధలను లింక్ చేసి డైలాగులు రాయడం.. అలాగే మాల్ బయట గిఫ్ట్ కూపన్స్ కోసం డీటైల్స్ సేకరించడం వెనుక ఎంత బిజినెస్ ఉంటుందనే విషయాలను డీటైల్డ్ గా చూపడం వంటివి.. ఈ చిత్రాన్ని ఆడియన్స్ కు బాగా దగ్గర చేశాయి.

తొలి వారాంతం చివరకు అభిమన్యుడు మూవీ 6.35 కోట్ల గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల నుంచి వసూలు చేయగలిగింది. ఇందులో షేర్ రూపంలో వచ్చిన మొత్తం 3.8 కోట్లు ఉంది. ఓ డబ్బింగ్ సినిమా వీకెండ్ లో ఈ రేంజ్ లో పెర్ఫామ్ చేయడం సూపర్బ్ అనాల్సిందే. సమంత హీరోయిన్ గా నటించడం.. విశాల్ గత చిత్రం డిటెక్టివ్ ఇక్కడ బాగా ఆడడం వంటివి కూడా అభిమన్యుడికి కలిసొచ్చాయి.